News


బీఎండబ్ల్యూతో జట్టుకట్టిన జేఎల్‌ఆర్‌

Thursday 6th June 2019
news_main1559805808.png-26131

  • ఎలక్ట్రిక్ కార్ల టెక్నాలజీలో పరస్పర సహకారం

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌).. జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూతో జట్టుకట్టింది. ఎలక్ట్రిక్ కార్ల టెక్నాలజీ అభివృద్ధి కోసం ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు బుధవారం వెల్లడించింది. నూతనతరం ఎలక్ట్రిక్‌ టెక్నాలజీ సహకారంలో భాగంగా ఇరు సంస్థలు.. పరిశోధన, అభివృద్ధి, ఇంజినీరింగ్‌లో సంయుక్తంగా పెట్టుబడి పెడతాయి. ఈ అంశంపై వివరణ ఇచ్చిన జేఎల్‌ఆర్‌ ఇంజనీరింగ్ డైరెక్టర్ నిక్ రోగర్స్.. ‘తరువాతి తరం ఈడీయూ (విద్యుత్ డ్రైవ్ యూనిట్స్‌) అవసరం ఇరు సంస్థలకూ ఉందనేది బీఎండబ్ల్యూ డైరెక్టర్లతో చర్చించాక మాకు స్పష్టమైంది. రెండు కంపెనీలకు ఈ భాగస్వామ్యం పరస్పర ప్రయోజనం అందిస్తుంది’ అని చెప్పారు. ప్రీమియం బ్యాటరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ జాగ్వర్ ఐ-పేస్‌, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ మోడల్స్‌ను ఇప్పటికే ప్రదర్శించిన జేఎల్‌ఆర్‌.. ఎలక్ట్రిక్ కార్ రంగంలో తన ఉనికిని చాటిచెప్పిన విషయం తెలిసిందే. కాగా, 2013లోనే ఐ3 విడుదలతో బీఎండబ్ల్యూ ఈ విభాగంలో సత్తాచాటింది. 



You may be interested

2025 నాటికి కోటి టన్నుల ఉత్పత్తి

Thursday 6th June 2019

కొత్త ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులొచ్చాయి  కావాల్సిన ఎక్విప్‌మెంట్‌కు ఆర్డర్లు పూర్తయ్యాయి  ‘సాక్షి’తో సాగర్‌ సిమెంట్స్‌ జేఎండీ శ్రీకాంత్‌ రెడ్డి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ సాగర్‌ సిమెంట్స్‌ భారీగా విస్తరిస్తోంది. 2025 నాటికి వార్షిక తయారీ సామర్థ్యాన్ని 10 మిలియన్‌ టన్నులకు (కోటి టన్నులకు) చేర్చాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రతి 10 ఏళ్లకు సామర్థ్యాన్ని రెండింతలు చేయాలన్నది సంస్థ ధ్యేయం. ప్రస్తుతం ఉన్న మూడు ప్లాంట్లతో కలిపి సంస్థ ఉత్పత్తి సామర్థ్యం

సేవల రంగం వృద్ధి ఏడాది కనిష్టానికి

Thursday 6th June 2019

మేలో 50.2 పాయింట్లకు నికాయ్ ఇండియా పీఎంఐ సూచీ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, కొత్త ఆర్డర్ల రాక తగ్గడం తదితర అంశాల కారణంగా గత నెల దేశీయంగా సేవల రంగం కార్యకలాపాలు వృద్ధి ఏడాది కనిష్టానికి పడిపోయింది. దీనికి కొలమానంగా పరిగణించే నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ పీఎంఐ సూచీ మే లో 50.2 పాయింట్లకు తగ్గింది. ఏప్రిల్‌లో ఇది 51.0గా ఉంది. గడిచిన పన్నెండు నెలల్లో

Most from this category