News


జేకే లక్ష్మీ సిమెంట్‌ లాభం 17 రెట్లు అప్‌

Wednesday 29th January 2020
news_main1580275676.png-31292

  • 4 శాతం పెరిగిన ఆదాయం 
  • తగ్గిన రవాణా, ఇతర వ్యయాలు

న్యూఢిల్లీ: జేకే లక్ష్మీ సిమెంట్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 17 రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.3 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.51 కోట్లకు పెరిగిందని జేకే లక్ష్మీ సిమెంట్‌ కంపెనీ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.1,038 కోట్ల నుంచి 4 శాతం పెరిగి రూ.1,078 కోట్లకు పెరిగిందని పేర్కొంది. రవాణా వ్యయాలు, ఇంధన వ్యయాలు తగ్గడంతో  గత క్యూ3లో రూ.112 కోట్లుగా ఉన్న నిర్వహణ లాభం ఈ క్యూ3లో రూ.167 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ.1,050 కోట్ల నుంచి 3 శాతం తగ్గి రూ.1,016 కోట్లకు చేరాయి. 



You may be interested

హైదరాబాద్‌లో టెక్‌ మహీంద్రా గూగుల్‌ క్లౌడ్‌ సెంటర్‌

Wednesday 29th January 2020

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రముఖ ఐటీ రంగ కంపెనీ టెక్‌ మహీంద్రా హైదరాబాద్‌లో గూగుల్‌ క్లౌడ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను (సీఓఈ) ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీల డిజిటల్‌ ట్రాన్స్ఫ్‌ర్మేషన్‌ను వేగవంతం చేయడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సెంటర్‌ ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), డేటా అనలిటిక్స్‌ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి కూడా ఉపకరిస్తుందని  టెక్‌ మహీంద్రా క్లౌడ్‌ సర్వీసెస్‌ గ్లోబల్‌ హెడ్‌ వివేక్‌

టీసీఎస్‌ మెడకు టాటాటెలి ఏజీఆర్‌ బకాయి గుదిబండ!

Wednesday 29th January 2020

నిధుల సమీకరణ యత్నాల్లో టాటాసన్స్‌ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టాటాటెలిసర్వీసెస్‌కు చెందిన రూ. 13823 కోట్ల ఏజీఆర్‌ బకాయిలు చెల్లించేందుకు టాటాసన్స్‌ నిధులు సమకూర్చుకుంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం తమ గ్రూప్‌నకు చెందిన దిగ్గజ కంపెనీ టీసీఎస్‌పై టాటాసన్స్‌ ఎక్కువగా ఆధారపడనుందని తెలిపింది. ఏజీఆర్‌ బకాయిలపై వేసిన రివ్యూ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడంతో టాటాటెలి తక్షణం ఈ బకాయిలు చెల్లించాల్సిఉంది. ఇందుకోసం టీసీఎస్‌ నుంచి నిధులు సమకూర్చుకోవాలని టాటాసన్స్‌ యోచిస్తోంది.

Most from this category