News


ఆర్‌కామ్‌ ఆస్తులు జియో, యూవీఏఆర్‌సీకే..!

Wednesday 15th January 2020
news_main1579060071.png-30938

టాప్‌ బిడ్డర్లుగా నిలిచిన సంస్థలు
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ ఆస్తులకు నిర్వహించిన వేలంలో టాప్‌ బిడ్డర్లుగా రిలయన్స్‌ జియో, యూవీఏఆర్‌సీ నిలిచాయి. ఆర్‌కామ్‌కు సంబంధించి స్పెక్ట్రమ్‌, రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులు, డేటా కేంద్రాలకు రూ.16,000 కోట్లను కోట్‌ చేసి అత్యధిక బిడ్డర్‌గా యూవీఏఆర్‌సీ నిలిచినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఆర్‌కామ్‌కు చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ మొబైల్‌ టవర్‌, ఫైబర్‌ ఆస్తులకు రూ.4,700 కోట్లతో జియో అత్యధిక బిడ్డర్‌గా నిలిచినట్టు తెలిపాయి. 90 రోజుల్లోపే 30 శాతాన్ని చెల్లించేందుకు ఆసక్తి చూపించినట్టు పేర్కొన్నాయి. ఈ బిడ్లకు ఆర్‌కామ్‌ రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోద ముద్ర వేస్తే.. మొత్తం 38 మంది రుణదాతలు రూ.33,000 కోట్ల బకాయిల్లో 75 శాతాన్ని పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. 



You may be interested

బంధన్‌ బ్యాంక్‌ లాభం రూ.731 కోట్లు

Wednesday 15th January 2020

గత క్యూ3లో రూ.331 కోట్ల నికర లాభం  ఈ క్యూ3లో ఆదాయం రూ.3,075 కోట్లు  న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో భారీగా పెరిగింది. గత క్యూ3లో రూ.331 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.731 కోట్లకు పెరిగిందని బంధన్‌ బ్యాంక్‌ వెల్లడించింది. మొత్తం ఆదాయం రూ.1,884 కోట్ల నుంచి రూ.3,075 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  బంధన్‌ బ్యాంక్‌లో

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 15th January 2020

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు(15న) ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. చైనాతో వాణిజ్య వివాద పరిష్కార ప్రాథమిక్‌ డీల్‌ నేడు కుదరనున్న నేపథ్యంలో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఇక ప్రస్తుతం ఆసియా స్టాక్‌ మార్కెట్లలో జపాన్‌, చైనా, హాంకాంగ్‌ తదితరాలు 0.5 శాతంపైగా నీరసించి కదులుతున్నాయి. మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు చరిత్రాత్మ గరిష్టాల వద్ద నిలవడంతో నేడు దేశీ మార్కెట్లలో కొంతమేర

Most from this category