News


4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో జియో టాప్‌

Wednesday 18th July 2018
news_main1531890647.png-18426

న్యూఢిల్లీ: డౌన్‌లోడ్‌ స్పీడ్‌కు 4జీ టెలికం ఆపరేటర్లలో 4జీ డేటా డౌన్‌లోడ్ స్పీడ్‌కి సంబంధించి రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిల్చింది. మరోవైపు అప్‌లోడ్‌కి సంబంధించి అత్యధిక స్పీడ్‌తో ఐడియా సెల్యులార్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. మే నెలకు సంబంధించిన ఈ గణాంకాలను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం వెల్లడించింది. దీని ప్రకారం జియో సగటు డౌన్‌లోడ్ స్పీడ్ 22.3 ఎంబీపీఎస్‌గా ఉంది. ఇది సమీప ప్రత్యర్ధి సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌తో పోలిస్తే రెట్టింపు స్థాయి. భారతీ ఎయిర్‌టెల్ డౌన్‌లోడ్ స్పీడ్ 9.7 ఎంబీపీఎస్‍గా ఉండగా, వొడోఫోన్‌ది 6.7 ఎంబీపీఎస్‌గాను, ఐడియా సెల్యులార్‌ది 6.1 ఎంబీపీఎస్‌గాను నమోదైంది. అయితే, సగటున 5.9 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఐడియా సెల్యులార్ అప్‌లోడ్‌ విషయంలో అగ్రస్థానంలో నిల్చింది. 5.3 ఎంబీపీఎస్‌-3.8 ఎంబీపీఎస్ సగటు స్పీడ్‌తో వొడాఫోన్‌, జియో, ఎయిర్‌టెల్‌ వరుసగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. You may be interested

ఈ స్టాకులపై ఎఫ్‌పీఐల మక్కువ

Wednesday 18th July 2018

జూన్‌త్రైమాసికంలో విదేశీ ఇన్వెస్టర్లు వాటాలు పెంచుకున్న షేర్లు దేశీయ ఈక్విటీల్లో గత త్రైమాసికం విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడిదారులు((ఎఫ్‌పీఐలు) దాదాపు 20700 కోట్ల రూపాయలను ఉపసంహరించుకున్నాయి. అయితే ఇదే సమయంలో కొన్ని ఎంపిక చేసిన స్టాకుల్లో పెట్టుబడులను పెంచుకోవడం గమనార్హం. ఇలా జూన్‌ త్రైమాసికంలో ఎఫ్‌పీఐలు వాటాలు పెంచుకున్న షేర్లు, వాటి వివరాలు... 1. ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌: జూన్‌ క్వార్టర్‌లో ఎఫ్‌పీఐలు ఈ కంపెనీలో వాటాను 6.79 శాతం మేర పెంచుకున్నాయి. యాజమాన్యం చేతులు

టాటా స్పాంజ్‌ ఐరన్‌ లాభం 49 శాతం

Wednesday 18th July 2018

న్యూఢిల్లీ: టాటా స్పాంజ్‌ ఐరన్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 49 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.31 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.46 కోట్లకు పెరిగిందని టాటా స్పాంజ్‌ ఐరన్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.202 కోట్ల నుంచి రూ.273 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్‌ 0.9 శాతం లాభంతో

Most from this category