News


అక్టోబర్‌లోనూ కొనసాగిన జియో జోరు

Tuesday 31st December 2019
Markets_main1577762628.png-30541

- 91 లక్షల నూతన చందాదారులు

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో.. సబ్‌స్క్రైబర్ల సంఖ్యను  గణనీయంగా పెంచుకుంటోంది. అనతికాలంలోనే భారతీ ఎయిర్‌టెల్‌ను వెనక్కు నెట్టి రెండో స్థాన్నాన్ని కైవసం చేసుకున్న ఈ సంస్థ.. అదే జోరును కొనసాగిస్తూ, వాయు వేగంతో దూసుకుపోతోంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తాజాగా ప్రకటించిన సమాచారం ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్‌లో నూతనంగా 91 లక్షల చందాదారులు జతకావడంతో సంస్థ మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 36.43 కోట్లకు చేరుకుంది. విశేషం ఏంటంటే.. జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు ఫోన్‌ చేస్తే చార్జీలు వర్తిస్తాయని అదే నెల్లో సంస్థ ప్రకటించింది. వినియోగదారులపై భారం మోపే నిర్ణయం వెలువడినప్పటికీ, చందాదారుల సంఖ్య మాత్రం తగ్గలేదు. ఇక వొడాఫోన్‌ ఐడియాకు 1.9 లక్షల మంది చందాదారులు జతయ్యారు. అక్టోబర్‌ చివరినాటికి ఈ సంస్థ ఉన్న సబ్‌స్క్రైబర్ల సంఖ్య 37.27 కోట్లుగా ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌కు 81,974 సబ్‌స్క్రైబర్లు జతకావడంతో, మొత్తం సంఖ్య 32.56 కోట్లకు చేరింది.



You may be interested

గ్యాప్‌ డౌన్‌ ఓపెనింగ్‌?!

Tuesday 31st December 2019

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 38 పాయింట్లు డౌన్‌  దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు(మంగళవారం) నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 12,289 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. సోమవారం స్వల్ప ఒడిదొడుకుల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. సెన్సెక్స్‌ 17 పాయింట్ల స్వల్ప నష్టంతో 41,558 వద్ద నిలవగా..

పోగొట్టుకున్న ఫోన్లను .. కనిపెట్టేందుకు పోర్టల్‌

Tuesday 31st December 2019

- ఢిల్లీ వాసుల కోసం వెబ్‌సైట్ ప్రారంభం - త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి న్యూఢిల్లీ: చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల ఆచూకీ దొరకపుచ్చుకునేందుకు, బ్లాక్ చేసేందుకు ఉపయోగపడే విధంగా కేంద్రం ప్రత్యేక పోర్టల్‌ను ఆవిష్కరించింది. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌) వాసుల కోసం www.ceir.gov.in వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని సుమారు 5 కోట్ల మంది మొబైల్ సబ్‌స్క్రయిబర్స్‌కు ఇది ఉపయోగకరంగా ఉండగలదని కేంద్ర టెలికం శాఖ మంత్రి

Most from this category