రెండో అతిపెద్ద టెలికం సంస్థగా ‘జియో’
By Sakshi

న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ సారథ్యంలోని ప్రముఖ టెలికం సంస్థ ‘రిలయన్స్ జియో’.. తాజాగా మరో సంచలనం సృష్టించింది. దిగ్గజ సంస్థలను వెనక్కి నెడుతూ ఈ రంగంలో వాయు వేగంతో దూసుకుపోతోంది. చందాదారుల సంఖ్య పరంగా ఇప్పటివరకు రెండో స్థానంలో కొనసాగిన భారతీ ఎయిర్‌టెల్‌ను పక్కకు నెట్టి.. ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈఏడాది మే నెలలో కంపెనీ చందాదారుల సంఖ్య 32.29 కోట్లకు చేరుకుంది. మార్కెట్ వాటా 27.80 శాతానికి ఎగబాకింది. మే నెలలో నూతనంగా 81.80 లక్షల చందాదారులు జతయ్యారు. ఇక, భారతీ ఎయిర్టెల్ మొత్తం చందాదారుల సంఖ్య మే చివరినాటికి 32.03 కోట్లకు పడిపోయింది. దీంతో మార్కెట్ వాటా 27.58 శాతానికి తగ్గిపోయింది. ఇక మొదటి స్థానంలోని వోడాఫోన్ ఐడియా 38.75 కోట్ల చందాదారులతో 33.36 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.
You may be interested
ఫుట్‌బాల్ మ్యాచ్ టికెట్లు, వాచీలు..
Saturday 20th July 2019రేటింగ్ ఏజెన్సీల అధికారులకు లంచాలు మెరుగైన రేటింగ్ పొందేందుకు అడ్డదారులు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ స్కామ్‌లో వెలుగులోకి నిజాలు న్యూఢిల్లీ: వేల కోట్ల రుణాల డిఫాల్ట్‌తో మార్కెట్లను అతలాకుతలం చేసిన ఇన్ఫ్రా ఫైనాన్స్ సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కుంభకోణంలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అధిక రేటింగ్ పొందేందుకు కంపెనీ మేనేజ్మెంట్ ఏ విధంగా అడ్డదారులు తొక్కినదీ వివరాలన్నీ ఒక్కొక్కటిగా బైటికొస్తున్నాయి. రేటింగ్ ఏజెన్సీల అధికారులకు ఫుట్‌బాల్ మ్యాచ్ టికెట్ల నుంచి వాచీలు, షర్టుల దాకా తాయిలాలిచ్చి ఏ
‘సోలార్’.. కేరాఫ్ ప్రాకృతిక్ పవర్!
Saturday 20th July 2019విక్రయం, నిర్వహణ, రాయితీలు అన్నీ ఒక్క చోటే త్వరలోనే ఆఫ్రికాలో 25 మెగావాట్ల ప్రాజెక్ట్స్ ఏడాదిలో రూ.20 కోట్ల టర్నోవర్ లక్ష్యం ‘స్టార్టప్ డైరీ’తో కో–ఫౌండర్ సాహిత్య సింధు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్ ఆవశ్యకత మనకు తెలిసిందే! కానీ, విద్యుత్ ఫలకాల ఏర్పాటు నుంచి కొనుగోలు, ఇన్స్టలేషన్, నిర్వహణ, ప్రభుత్వ రాయితీలు తీసుకోవటం వరకూ ప్రతిదీ పెద్ద పనే. పెద్ద స్థాయిలో సోలార్ పవర్‌ను ఏర్పాటు చేసే కార్పొరేట్ సంస్థలకైతే మరీనూ. జస్ట్!