News


జియో లిస్టింగ్‌కు కసరత్తు షురూ

Saturday 26th October 2019
Markets_main1572061993.png-29147


- డిజిటల్ కోసం అనుబంధ సంస్థ 
- దాని రుణాలన్నీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు

న్యూఢిల్లీ: టెలికం వ్యాపార సంస్థ రిలయన్స్ జియో (ఆర్‌జియో) లిస్టింగ్‌ దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా డిజిటల్ వ్యాపార విభాగాలన్నింటిని ఒకే గొడుగు కిందకి తీసుకొస్తూ ప్రత్యేక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రిలయన్స్ జియో సహా డిజిటల్‌ వ్యాపార విభాగాలకు ఉన్న రుణభారాన్ని (సుమారు రూ. 1.73 లక్షల కోట్లు) తన పేరిట బదలాయించుకోనుంది. ప్రతిగా అనుబంధ సంస్థలో పూర్తి వాటాలను దక్కించుకోనుంది. దీనితో ఆర్‌ఐఎల్‌కు రిలయన్స్ జియో 100 శాతం అనుబంధ సంస్థగా (డబ్ల్యూవోఎస్‌) మారుతుంది. ఈ ప్రతిపాదనకు జియో పేరిట రుణాలిచ్చిన బ్యాంకులు, డిబెంచర్ హోల్డర్లు అనుమతి తెలిపినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయితే 2020 మార్చి 31 నాటికి స్పెక్ట్రంపరంగా చెల్లించాల్సిన చెల్లింపులు తప్పితే.. రిలయన్స్ జియో పూర్తి రుణ రహిత సంస్థగా మారుతుందని పేర్కొంది. 


JIO

You may be interested

కొత్త సంవత్‌లో బ్రోకరేజిల నిఫ్టీ, సెన్సెక్స్‌ అంచనాలు!

Saturday 26th October 2019

- ఆశావహంగా కొత్త సంవత్‌.. - వడ్డీ రేట్ల కోత, ఉద్దీపనలు కీలకం  - మరిన్ని సంస్కరణలకు అవకాశాలు - ట్యాక్స్‌ రేటు తగ్గింపుతో కార్పొరేట్లకు ఊతం - నిఫ్టీ టార్గెట్‌ 14,000, సెన్సెక్స్‌ 46,000 - బ్రోకరేజీల అంచనాలు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌తో మొదలైన సంక్షోభం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలను కుదిపేస్తోంది. అంతర్జాతీయంగానేమో మందగమనం, వాణిజ్య యుద్ధ భయాలు రాజ్యమేలుతున్నాయి. అందుకే... మదుపరులకు సంవత్‌ 2075 పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. జీడీపీ అంచనాల తగ్గింపు, కంపెనీల ఆదాయాల

ఒడిదుడుకుల ట్రేడింగ్‌: ఫ్లాట్‌ ముగింపు

Friday 25th October 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి దాదాపు ఫ్లాట్‌ ముగిశాయి. సెన్సెక్స్‌ 37.67 పాయింట్ల లాభంతో 39,058.06 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 1.30 పాయింట్ల లాభంతో 11,583.90 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌, ఐటీ, మీడియా, ఆర్థిక, రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మెటల్‌, ఫార్మా, ఎఫ్‌ఎంజీసీ, అటో రంగ షేర్లకు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్‌ షేర్లకు ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమై బ్యాంక్‌ నిఫ్టీ

Most from this category