News


జియో కాల్‌, డేటా ఛార్జీలు పెరగనున్నాయ్‌..!

Monday 2nd December 2019
news_main1575268285.png-30001

ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా సంస్థలతో పాటు ‍ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో కూడా టారీఫ్‌లను పెంచేందుకు సిద్ధమైంది. ఇందుకు కోసం కొత్త ‘‘ఆల్‌ఇన్‌వన్‌ ప్లాన్‌’’ను డిసెంబర్‌ 6 నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కోంది. ఈ కొత్త ప్లాన్‌లో భాగంగా అన్ని వాయిస్‌, డేటా ఛార్జీలను 40శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది. ఇతర మొబైల్‌ నెట్‌వర్క్‌కు కాల్స్‌పై విధించే ‘‘ఫెయిర్‌ యూసేజ్‌ పాలసీ’’ని పరిమితం చేస్తామని తెలిపింది. అలాగే ఈ నూతన ప్లాన్ కింద జియో కస్టమర్లకు 300శాతం అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని పేర్కోంది. సవరించిన టెలికం ఛార్జీల (ఏజీఆర్‌) విషయంలో ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపింది. టెలికం పరిశ్రమ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని టారీఫ్‌ల పెంపు తప్పడం లేదని జియో పేర్కొంది. వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ డిసెంబర్‌ 3 నుంచి పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

కొత్త ఆల్‌-ఇన్‌-ప్లాన్‌

 



You may be interested

తగ్గిన పసిడి.!

Monday 2nd December 2019

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో  6డాలర్లు నష్టపోయింది. నేటి ఆసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 6డాలర్లు నష్టంతో 1,464 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం, చైనా ఫ్యాకర్టీ సెక్టార్‌ గణాంకాలు మార్కెట్‌ అంచనాలను మించిన నమోదుకావడం పసిడి పతనానికి కారణమయ్యాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక దేశంగా పిలువబడే చైనా నవంబర్‌ ఫ్యాక్టరీ యాక్టివిటీ గణాంకాలు

దీర్ఘకాల లక్ష్యాలకు అనుకూలం

Monday 2nd December 2019

ఈక్విటీ మార్కెట్లలో స్వల్పకాలం పాటు అనిశ్చితులు ఉన్నా కానీ, దీర్ఘకాలానికి చూసుకుంటే మెరుగైన పనితీరే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న చరిత్ర ఇదే తెలియజేస్తుంది. కనుక ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు దీర్ఘకాల దృష్టితోనే అడుగులు వేయడం మంచిది. మధ్య కాలం నుంచి దీర్ఘకాల (కనీసం ఐదేళ్లు, ఆ పైన) లక్ష్యాల కోసం పరిశీలించాల్సిన పథకాల్లో డీఎస్‌పీ ఈక్విటీ అపార్చునిటీస్‌ కూడా ఒకటి. ఈ పథకం లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ విభాగాల్లో

Most from this category