News


సెప్టెంబర్‌5 నుంచి జియో ఫైబర్‌ సేవలు

Monday 12th August 2019
news_main1565603299.png-27717

జియో ఫైబర్‌ సేవలు సెప్టెంబర్‌ 5 నుంచి అందుబాటులోకి రానున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముఖేష్‌ అంబానీ తెలిపారు. మంగళవారం జరిగిన రిలయన్స్‌ 42వ ఏజీఎం సమావేశంలో ముఖేష్‌ మాట్లాడుతూ ‘‘అమెరికా లాంటి అభివృద్ధి చెందని దేశంలో ఇంటర్నెట్ సగటు వేగం 90ఎంబీపీపీస్‌గా ఉంది. ఇప్పుడు జియో ప్రవేశపెట్టే జియో ఫైబర్‌ పథకంలో ఇంటర్నెట్ సగటు వేగం 100 ఎంబీపీపీస్‌లు ఉంటుంది. ఈ వేగాన్ని 1000ఎంబీపీపీస్‌ పెంచుకునేందుకు మాకు ప్రణాళికలున్నాయి. భారత్‌ బాండ్‌బ్రాండ్‌ సర్వీస్‌ ప్రపంచంలో ఏ సర్వీస్‌కు తక్కువ కాదు. ఈ పథకం ఫిక్స్‌డ్‌ లైన్‌ డాటా నాణ్యత స్థాయి మరింత పెంచుతుంది’’  ముఖేష్‌ తెలిపారు. జియో ఫైబర్ ప్లాన్స్ నెలలో రూ. 700 నుంచి రూ. 10 వేల వరకు ఉంటాయన్నారు. ఇంటి నుంచి వాయిస్ కాల్ చేసుకునే సౌకర్యం ఉచితంగా అందచేస్తామని.. రూ. 500 రూపాయలతో అన్ లిమిటెడ్ (యూఎస్/కెనడా) కాల్స్ చేసుకోవచ్చన్నారు. జియో గిగా ఫైబర్ వార్షిక ప్లాన్ల ఏడాది తీసుకునే వారికి.. ఉచిత వాయిస్‌ కాల్స్‌, హై-స్పీడ్‌ బ్రాండ్‌ బాండ్‌, ఫ్రీ హెచ్‌డీ 4కే, తో పాటు సెట్‌ బాక్స్‌లతో పాటు ఓటీటీ యాప్‌లను కూడా అందిస్తామని ప్రకటించారు. ల్యాండ్‌లైన్‌ సబ్‌స్క్రైబర్లు ప్రస్తుతం టెలికాం పరిశ్రమ విధించే టారీఫ్‌లో పదోవంతు ధరలోనే అంతర్జాతీయ కాల్స్‌  చేయకోవచ్చని తెలిపారు. గిగా ఫైబర్ సేవల కోసం గతేడాదే రిజిస్ట్రేషన్లు ప్రారంభించామని, ఇప్పటివరకు 1600 పట్టణాల నుంచి 15 మిలియన్ రిజిస్ట్రేషన్లు వచ్చినట్లు అంబానీ తెలిపారు.You may be interested

రిలయన్స్‌ షేరు పెరిగే ఛాన్స్‌

Monday 12th August 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ఆయిల్‌ రిఫైనింగ్‌, పెట్రో కెమికల్‌  విభాగాలలో  సౌదీ ఆరామ్‌తో అతిపెద్ద ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ కంపెనీ షేరు విలువ మంగళవారం పాజిటివ్‌గా కదులుతుందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆర్‌ఐఎల్‌ ఎజీఎం మీటింగ్‌లో కంపెనీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరక్టర్‌ ముకేష్‌ అంబానీ మాట్లాడుతూ..వచ్చే 18 నెలలో కంపెనీని జీరో నికర అప్పు కలిగిన కంపెనీగా తీర్చుదిద్దుతామని, వచ్చే కొన్నేళ్లలో బోనస్‌లు, డివిడెండ్‌లు అధికంగా పంచనున్నామని ప్రకటించారు. ఈ

ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగ షేర్లే మంచి చాయిస్‌!

Monday 12th August 2019

‘ప్రస్తుత పరిస్థితులలో ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌), ఐటీ సెక్టార్‌ షేర్లు మిగిలిన రంగాల షేర్ల కంటే ఆకర్షిణియంగా ఉన్నాయి. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సెక్టార్లో కొన్ని సెలక్టివ్‌ స్టాకులను ఎంచుకోవడం మంచిదే’ అని రిలిగేర్‌ బ్రోకింగ్‌ రిసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, అజిత్‌ మిశ్రా ఓ ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. మార్కెట్ల బౌన్‌బ్యాక్‌కు పరిమితి.. ఆర్‌బీఐ రేట్ల కోత కాకుండా ప్రభుత్వం ఆర్థిక చర్యలను తీసుకుంటుందనే వార్తలు మీడియాలో వస్తుండడంతో

Most from this category