News


నేటి నుంచే జియోఫైబర్‌ సర్వీసులు ప్రారంభం

Thursday 5th September 2019
news_main1567652543.png-28195

జియో బ్రాడ్‌బ్యాండ్‌తో సెట్‌టాప్‌ బాక్స్ ఉచితం..!
న్యూఢిల్లీ: డీటీహెచ్‌, కేబుల్ టీవీ కస్టమర్లను ఆకర్షించే దిశగా టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రతి బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌పై ఉచితంగా సెట్‌ టాప్‌ బాక్స్ కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. "జియోఫైబర్‌ కస్టమర్లందరికీ కాంప్లిమెంటరీ సెట్‌టాప్ బాక్స్ కూడా లభిస్తుంది" అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే, పేరొందిన ఎంటర్‌టైన్‌మెంట్ మొబైల్ యాప్స్‌లోని వీడియో కంటెంట్, సినిమాలు మొదలైనవన్నీ కూడా జియోఫైబర్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. వీటి సబ్‌స్క్రిప్షన్ ఫీజు కూడా కలిపే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ చార్జీలు ఉంటాయి. ప్రత్యేకంగా కంటెంట్‌కు చెల్లించనక్కర్లేదు. ఇక సెట్‌టాప్‌కు కెమెరాను అమర్చుకుంటే టీవీ ద్వారా వీడియో కాలింగ్ సేవలు కూడా పొందవచ్చని సమాచారం.
    సెప్టెంబర్ 5 (నేడు) నుంచి ఆప్టికల్‌ ఫైబర్ ఆధారిత జియోఫైబర్‌ సర్వీసులను జియో ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. జియోఫైబర్‌ కస్టమర్లకు ల్యాండ్‌లైన్‌ నుంచి జీవితాంతం ఉచిత వాయిస్‌ కాల్స్‌, సెకనుకు 100 మెగాబిట్‌ నుంచి 1 గిగాబిట్‌ దాకా స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందనున్నాయి. దీని చార్జీలు నెలకు రూ. 700 నుంచి ప్రారంభమవుతాయి. వార్షిక ప్లాన్‌ తీసుకున్న వారికి ఉచితంగా హెచ్‌డీ టీవీ సెట్‌ కూడా అందిస్తామంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ సీఎండీ ముకేశ్ అంబానీ గతంలో వెల్లడించారు. మొత్తం మీద జియోఫైబర్‌ రాకతో చాలా మటుకు డైరెక్ట్ టు హోమ్ సేవలందించే సంస్థల వ్యాపారాలకు గట్టి దెబ్బే తగిలే అవకాశాలు ఉన్నాయని పరిశ‍్రమవర్గాలు భావిస్తున్నాయి. దీన్ని తట్టుకునేందుకు ఆయా సంస్థలు ఇప్పటికే వివిధ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. జీ5, హుక్‌ వంటి పలు వీడియో స్ట్రీమింగ్ మొబైల్ యాప్స్‌ కంటెంట్‌ అందుబాటులోకి తెస్తూ భారతీ ఎయిర్‌టెల్‌ కొత్తగా రూ. 3,999కి సెట్‌ టాప్ బాక్స్‌ను ఆవిష్కరించింది. తొలి ఏడాది తర్వాత రూ. 999 వార్షిక ఫీజుతో సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించవచ్చు. You may be interested

సెక్యురిటీ సేవల్లోకి జియో

Thursday 5th September 2019

అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలకు సర్వీసులు జియోగేట్‌ పేరుతో ప్లేస్టోర్‌లో యాప్‌ న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో మరిన్ని కొత్త రంగాల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తోంది. తాజాగా అపార్ట్‌మెంట్ల భద్రత నిర్వహణ సేవల విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు సంబంధించి యాపిల్‌ యాప్‌ స్టోర్, గూగుల్‌ ప్లే స్టోర్‌లో జియో గేట్‌ పేరిట కొత్త యాప్‌ ప్రత్యక్షమవడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. గేటెడ్‌ కమ్యూనిటీల్లో విజిటర్లు మొదలుకుని రోజువారీ సిబ్బంది, డెలివరీ

10,750కు దిగువన బలహీనత

Wednesday 4th September 2019

నిఫ్టీ బుధవారం 10,746 స్థాయిలో మద్దతు తీసుకుని కీలకమైన 10,800 స్థాయి పైన ముగిసింది. సూచీల్లో బలహీనత పెరగకూడదంటే నిఫ్టీ 10,800కు పైన గురువారం కూడా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అలాగే, 10,900-10,950 అవరోధాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు.    ‘‘గురువారం సెషన్‌కు 10,800 స్థాయి కీలకం. ఈ స్థాయి పైన కొనసాగడం సూచీకి కీలకం. గురువారం వీక్లీ ఆప్షన్ల కోజింగ్‌ కావడంతో సెషన్‌ ద్వితీయ భాగంలో సూచీలపై ప్రభావం పడే అవకాశం

Most from this category