News


యస్‌బ్యాంక్‌లో ఝన్‌ఝన్‌వాలా వాటా కొనుగోలు లేనట్లే!

Tuesday 10th December 2019
news_main1575967525.png-30153

యస్‌బ్యాంకులో దాదాపు 2.5 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టి వాటాలు కొనాలన్న ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా, తన ప్రతిపాదన ఉపసంహరించుకున్నట్లే కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. బ్యాంకు నిధుల సమీకరణ ప్లాన్స్‌పై సందేహాలు రాకేశ్‌ను వెనుకంజ వేసేలా ప్రేరేపించాయని అంచనా వేస్తున్నారు. రాకేశ్‌ తన భార్య రేఖా ఝన్‌ఝన్‌వాలా పేరుమీద యస్‌బ్యాంకులో వాటాలు కొనుగోలు చేయాలని భావించినట్లు బిజినెస్‌లైన్‌ వెల్లడించింది. ఈ విషయమై ఈరోజు ఒక ప్రకటన చేయాలని రాకేశ్‌ భావించారని తెలిపింది. కానీ ఆయన తన ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది. యస్‌బ్యాంకు ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ ధర ప్రస్తుత మార్కెట్‌ ధర కన్నా ఎక్కువని, దీనికితోడు వీటికి లాక్‌ఇన్‌ సమయం కూడా ఉందని, అందుకే రాకేశ్‌ వెనక్కు తగ్గారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనికి బదులు కావాలంటే ఓపెన్‌ మార్కెట్లో తక్కువ ధరకు షేరును కొనడం మేలని ఆయన భావించినట్లు తెలిపారు. ప్రస్తుతం యస్‌ బ్యాంక్‌ షేరు రూ. 52 వద్ద కదలాడుతోంది. బ్యాంకు ప్రిఫరెన్షియల్‌ ఆఫర్‌ ధరను రూ. 78గా నిర్ణయించారు. మరోవైపు బ్యాంకు బోర్డు కెనడా బిలియనీర్‌ ఎర్విన్‌ సింగ్‌ పెట్టుబడి ప్రతిపాదనను తిరస్కరించవచ్చని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. అయితే బ్యాంకు మాత్రం ఈ రెండు వార్తలను కొట్టిపారేసింది. డిసెంబర్‌ పదిన బ్యాంకు తన ఫండ్‌రైజింగ్‌ ప్లాన్స్‌ గురించి చర్చించనుంది. 



You may be interested

మూడున్నరేళ్ల కనిష్ఠానికి మ్యూచువల్‌ఫండ్‌ నిధులు!

Tuesday 10th December 2019

ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి మూడున్నరేళ్లలో రానంత తక్కువ నిధులు నవంబర్‌లో వచ్చాయి. ఈక్విటీఎంఎఫ్‌ల్లోకి నవంబర్‌లో రూ. 1311 కోట్ల నిధులు వచ్చాయి. అక్టోబర్‌తో పోలిస్తే ఇది 78 శాతం తక్కువ. అయితే ఎంఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) మాత్రం నవంబర్‌లో రికార్డు గరిష్ఠం  రూ.27 లక్షల కోట్లకు చేరింది. అక్టోబర్‌తో పోలిస్తే ఇది 3 శాతం అధికం. డెట్‌ పథకాల్లోకి వచ్చిన నిధులు ఏయూఎంల విలువ పెరిగేందుకు దోహదం చేశాయి. నవంబర్లో

యస్‌బ్యాంక్‌ 12.50శాతం క్రాష్‌..!

Tuesday 10th December 2019

కీలకమైన బోర్డు సమావేశానికి ముందు మంగళవారం యస్‌బ్యాంక్‌ షేరు 6.50 శాతం నష్టపోయింది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.55.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు జరిగే బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో బ్యాంకులో పెట్టుబడులకు ఆసక్తిని కనబరిచే రుణదాతుల ఆఫర్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా మూలధన నిధుల సమీకరణకు షేర్‌ హోల్డర్ల అనుమతులు తీసుకోనున్నారు. యస్‌బ్యాంక్‌ ప్రిఫరెన్షియల్‌ షేర్ల కేటాయింపుల ద్వారా

Most from this category