News


జువెలర్స్‌కు ఐటీ రికవరీ నోటీసులు

Thursday 2nd January 2020
news_main1577939811.png-30607

దేశవ్యాప్తంగా పలు జువెలరీ సంస్థలకు ఆదాయపన్ను శాఖ రికవరీ నోటీసులు జారీ చేసింది. 2016-17 కాలంలో నోట్ల రద్దు తర్వాత చేసిన డిపాజిట్లకు సంబంధించి ఐటీ శాఖ ఈ నోటీసుల్లో రికవరీలు చెల్లించాలని ఆదేశించిందని బిజినెస్‌ స్టాండర్డ్‌ ఒక నివేదికలో పేర్కొంది. అయితే కొన్ని నెలలుగా డిమాండ్‌ స్తబ్దుగా ఉండడంతో జువెలరీ సంస్థల రెవెన్యూ అంతంతమాత్రంగా ఉంది. ఈ సమయంలో జరిమానాలు చెల్లించడం పలు జువెలరీ సంస్థలకు సాధ్యం కాకపోవచ్చని నివేదిక అభిప్రాయపడింది. అప్పుడు వ్యాపారాలు నిర్వహించిన సంస్థలకు చెందిన పలు స్టోర్లు మూతపడ్డాయని గుర్తు చేసింది. ఈ నోటీసులకు గత డిసెంబర్‌ 31లోపు జువెలరీలు స్పందించాల్సిఉంది. అత్యధికంగా ఢిల్లీలో జువెలర్స్‌ ఎక్కువగా నోటీసులు అందుకున్నారు. తర్వాత స్థానంలో ముంబై నిలిచింది.

2016 నోట్ల రద్దు అనంతరం పలు జువెలరీ సంస్థలు పాత నోట్లు తీసుకొని ఆభరణాలు, బంగారం 30- 40 శాతం ప్రీమియానికి విక్రయించాయని నివేదిక తెలిపింది. ఆ సమయంలో వచ్చిన నోట్లకు సంబంధించి పలు జువెలరీ సంస్థలు అదనపు జరిమానా చెల్లించాల్సిఉందని ఐటీ తన తాజా నోటీసుల్లో ఆదేశించింది. ఐటీ నోటీసుల నేపథ్యంలో ప్రతి జువెలరీ హోల్‌సేల్‌ సంస్థ రిటైల్‌ జువెలర్ల కేవైసీ నిర్వహించాలని, ఇందులో టాక్స్‌ డిమాండ్‌ పొందుపరచాలని సూచించినట్లు భారత బులియన్‌, జువెలర్స్‌ సమాఖ్య జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా చెప్పారు. 



You may be interested

స్థిరంగా పసిడి

Thursday 2nd January 2020

అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చ ఒప్పం‍దం పురోగతి దిశగా సాగుతున్న నేపథ్యంలో డాలర్‌ బలహీనత కారణంగా గురువారం పసిడి ఫ్యూచర్ల ధర స్థిరంగా కదులుతోంది. ఆసియా ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప లాభంతో 1,524డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య తొలిదశ వాణిజ్య చర్చలు కుదిరి అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అవుట్‌లుక్‌ను మరింత మెరుగుపరచవచ్చనే అంచనాలతో ఈ ఏడాది

గురువారం వార్తల్లోని స్టాక్స్‌

Thursday 2nd January 2020

కొత్త ఏడాది(2020) ప్రారంభం​సందర్భంగా అమెరికా, యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు సెలవుల్లో కొనసాగుతున్నాయి. అయితే ఆసియాలో జపాన్‌ మినహా మిగిలిన మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఏడాదిన్నర కాలంగా నలుగుతున్న వాణిజ్య వివాదాల పరిష్కారానికి వీలుగా ఈ నెల 15న చైనాతో​ ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొనడంతో సెంటిమెంటు మెరుగుపడింది. దీంతో చైనాసహా పలు ఆసియా మార్కెట్లు 1.3-0.3 శాతం మధ్య ఎగశాయి. దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం సానుకూలం‍గా

Most from this category