News


జెట్‌ కోసం ఉద్యోగుల కన్సార్షియం బిడ్‌

Saturday 29th June 2019
news_main1561780509.png-26672

  • ఆది గ్రూప్‌తో కలిసి 75 శాతం వాటా కొనుగోలుకు ప్రకటన

న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేసేందుకు ఆ సంస్థ ఉద్యోగులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జెట్‌లో 75 శాతం వాటా దక్కించుకోవడానికి బిడ్‌ వేస్తామని.. ఇందుకోసం బ్రిటన్‌కు చెందిన ఆది గ్రూప్‌తో జట్టు కట్టామని జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగుల కన్సార్షియం శుక్రవారం ప్రకటించింది. ఎస్‌బీఐ నేతృత్వంలోని 26 బ్యాం‍కుల కన్సార్షియం దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అనుమతించిన సంగతి తెలిసిందే. 90 రోజుల్లోగా దివాలా ప్రక్రియను పూర్తి చేయాలని కూడా ఎన్‌సీఎల్‌టీ సబం‍ధిత అధికారికి ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులకు జెట్‌ రుణ బకాయిలు రూ.8,500 కోట్లమేర పేరుకుపోగా.. వెండార్లు, లీజుదారులు, ఉద్యోగులకు దాదాపు రూ.25,000 కోట్లమేర చెల్లించాల్సి ఉంది. ‘ఎన్‌సీఎల్‌టీ దివాలా ప్రక్రియ ద్వారా జెట్‌లో 75 శాతం వాటా కోసం ఆదిగ్రూప్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగుల కన్సార్షియం భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. దేశ విమానయాన రంగ చరిత్రలోనే ఇదో కొత్త అధ్యాయానికి తెరతీయనుంది. కంపెనీలోని ప్రతి ఒక్క ఉద్యోగిని కూడా యజమానిగా మార్చే దిశగా ఈ చర్యలు దోహదం చేస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ ‘సబ్‌కా సాథ్‌ సబ్‌కా విశ్వాస్‌’ అనే కలను సాకారం చేసేందుకు ఇది తోడ్పడుతుంది’ అని ఉద్యోగుల కన్సార్షియం, ఆదిగ్రూప్‌లు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. 



You may be interested

చిన్న పొదుపు పథకాలపై తగ్గిన వడ్డీ

Saturday 29th June 2019

10 బేసిస్‌ పాయింట్లు కుదింపు ఆర్‌బీఐ సరళతర విధానమే కారణం న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను ప్రభుత్వం 10 బేసిస్‌ పాయింట్లు (0.1 శాతం) తగ్గించింది. జూలై- సెప్టెంబర్‌ మధ్య కాలానికి సవరించిన తాజా రేట్లు వర్తిస్తాయని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. 2019- 20 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికానికి తాజా రేట్లను నోటిఫై చేసింది. ద్రవ్య, పరపతి విధాన ప్రాతిపదికన ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న పథకాలపై

ఐపీఓకు గో ఎయిర్‌!

Saturday 29th June 2019

 ఇష్యూ సైజు రూ.1,700- 2,000 కోట్లు  డిసెంబర్ లేదా జనవరిలో పబ్లిక్‌ ఇష్యూ ముంబై: బడ్జెట్‌ ధరల విమానయాన సంస్థ, గో ఎయిర్‌ త్వరలో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) రానుంది. గతంలో ఐపీఓ ప్రణాళికను అటకెక్కించిన ఈ కంపెనీ నిధుల సమీకరణ నిమిత్తం ఐపీఓకు సిద్ధమవుతోందని తెలిసింది. బ్రిటానియా ఇండస్ట్రీస్‌, బోంబే డైయింగ్‌వంటి కంపెనీలను నిర్వహిస్తున్న వాడియా గ్రూప్‌ నేతృత్వంలోని ఈ కంపెనీ, తన ఐపీఓ కోసం సిటీ, మోర్గాన్‌ స్టాన్లీ

Most from this category