News


జెట్‌ఎయిర్‌వేస్‌ బిడ్డర్లు వీరే..!

Wednesday 17th April 2019
news_main1555496250.png-25190

జెట్‌ ఎయిర్‌ను రుణ సంక్షోభ కష్టాల నుంచి గట్టిక్కేంచే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. దివాళా ప్రక్రియ చర్చల్లో భాగంగా కంపెనీ వాటాలను విక్రయించేందుకు ఎస్‌బీఐ మార్కెట్‌ క్యాపిటల్స్‌ నాలుగు బిడ్డర్లను ష్టార్‌ లిస్ట్‌ చేసినట్లు తెలిపింది. ఎతిహాత్‌ ఎయిర్‌లైన్స్‌తో పాటు టీపీజీ క్యాపిటల్‌, ఇండిగో పేరెంట్స్‌, ఎన్‌ఐఐఎఫ్‌లు షార్ట్‌లిస్టయిన బిడ్డర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. లిస్టింగ్‌లో చోటు దక్కించుకున్న ఈ నాలుగు కంపెనీలు ఏప్రిల్‌ 30 తేదీలోపు బిడ్ల‌ను సమర్పించాల్సి ఉంటుంది. గోయల్ బిడ్‌లో పాల్గొంటే వాకౌట్ చేస్తామని ఎతిహాద్, టిపిజి క్యాపిటల్ సంస్థలు హెచ్చరించడంతో బిడ్ ప్రక్రియ నుంచి గోయల్‌ తప్పుకున్నారు. 
టీపీజీ క్యాపిటల్‌:- అమెరికాలో ఆధారిత  ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ. పరిశ్రమలు, ఫైనాన్స్‌, హెల్త్‌కేర్‌, టెక్నాలజీ, రియల్‌ ఎస్టేజ్‌ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. కంపెనీ 1993లో దివాళా తీసిన కాంటినెంటల్ ఎయిర్‌ లైన్స్‌ మొదటి పెట్టుబడులు పెట్టడం ఆసక్తి కలిగించే అంశం. ఇక మనదేశంలో చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఫైనాన్షియల్ గ్రూప్ సంస్థ శ్రీరామ్ గ్రూప్ కంపెనీలో భాగమైన సిటీ యూనియన్ పైనాన్స్‌లో టీపీజీ క్యాపిటల్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. సుమారు రూ. 530 కోట్లు గల ఈ పెట్టుబడిలో శ్రీరామ్ సంస్థలోని 49 శాతం వాటాలను టీపీజీ కైవసం చేసుకోనుంది.
ఇండిగో పార్టనర్స్‌:- ఇది కూడా అమెరికా ఆధారిత ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ. మొదట్లో మనదేశానికి చెందిన కింగ్‌ఫిషన్‌ ఎయిర్‌లైన్స్‌, స్పెస్‌జెట్‌లో వాటా కొనుగోలుకు ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు జెయిర్‌వేస్‌లో వాటా కొనుగోలు ద్వారా మనదేశంలో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఈ కంపెనీకి ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్, చిలీ జెట్ స్మార్ట్‌లో కంట్రోలింగ్‌ వాటా ఉన్నాయి. 
ఎతిహాత్‌ ఎయిర్‌లైన్స్‌:- అబుదాబి ఎయిర్‌లైన్‌ కంపెనీ. ఇప్పటికే జెట్‌ ఎయిర్‌వేస్‌లో 24శాతం వాటా కలిగి ఉంది. 2013లో 397మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. తాజాగా జెట్‌ను పూర్తిగా స్వంతం చేసుకోవడం ద్వారా పశ్చిమాసియాలో విమాన రంగంలో అగ్రగామి కంపెనీగా ఎదగాలని కోరుకుంటుంది. 
ఎన్‌ఐఎఫ్‌ఎఫ్‌:- జాతీయ పెట్టుబడి, మౌలిక నిధి(నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్). దేశంలో మౌలిక రంగ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం కోసం 2016లో భారత ప్రభుత్వ ఏర్పాటు చేసింది. ఇందులో ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది. ఇప్పుడు జెట్‌ ఎయిర్‌వేస్‌ వాటాల కొనుగోలుకు ఆసక్తి చూపుతోంది.You may be interested

ఆఫ్‌షోర్‌లో బలపడిన రూపాయి

Wednesday 17th April 2019

క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో భారీగా నష్టపోయి 69.60 స్థాయికి పడిపోయిన రూపాయి బుధవారం ఆఫ్‌షోర్‌ మార్కెట్లో (విదేశాల్లో జరిగే ట్రేడింగ్‌) 25 పైసలు బలపడి రూ. 69.35 వద్దకు చేరింది. మహవీర్‌ జయంతి కారణంగా భారత్‌లో కరెన్సీ మార్కెట్లకు ఈ రోజు సెలవు దినమైనందున...గురువారం నాటి ట్రేడింగ్‌లో ఇక్కడ కూడా డాలరు మారకంలో రూపాయి విలువ పెరిగే అవకాశం వుంటుంది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో చైనా జీడీపీ విశ్లేషకుల

ఆటో, మెటల్‌ షేర్లు పెరగొచ్చు

Wednesday 17th April 2019

ప్రధాన సూచి నిఫ్టీ బ్రేక్‌అవుట్‌ అయిన నేపథ్యంలో స్వల్పకాలిక చార్టుల్లో ఆటో, మెటల్‌ షేర్లు పటిష్టంగా కన్పిస్తున్నాయని, తగిన స్టాప్‌లాస్‌తో ఈ రంగాలకు చెందిన లార్జ్‌క్యాప్‌ షేర్లలో పొజిషన్లు తీసుకోవొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ డెరివేటివ్‌ అనలిస్ట్‌ వినయ్‌ రజని సూచించారు. నిఫ్టీ 11,760 పాయింట్ల ఎగువన 12,000 పాయింట్ల స్థాయికి చేరే ఛాన్స్‌ వుందని, అయితే సూచీ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా స్వల్పకాలంలో కొన్ని షేర్లు పెరగవచ్చని, వాటిలో ఆటో, మెటల్‌ షేర్లు

Most from this category