News


జెట్ ఎయిర్‌వేస్‌ ఫలితాలు ఆలస్యం !

Saturday 17th August 2019
news_main1566018215.png-27825

న్యూఢిల్లీ: విమానయాన సం‍స్థ, జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి ఆలస్యం కానున్నది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ కంపెనీ తన కార్యకలాపాలను నిలపేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కంపెనీపై దివాళా ​‍ప్రక్రియ నడుస్తోంది. దివాలా చట్టం కింద రిజల్యూషన్‌ ప్రక్రియను రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ ఆశీష్‌ చౌచారియా నిర్వహిస్తున్నారు. కంపెనీ ఎదుర్కొంటున్న వివిధ సమస్యల కారణంగా ఆర్థిక ఫలితాల వెల్లడి జాప్యం కానున్నదని ఆయన స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు వెల్లడించారు. 

రిజల్యూషన్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందే, కంపెనీ డైరెక్టర్లు, సీఈఓ, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌, కంపెనీ సెక్రటరీ, ఇతర ఉన్నత స్థాయి మేనేజ్‌మెంట్‌ ఉద్యోగులు రాజీనామా చేశారని చౌచారియా పేర్కొన్నారు. అందుకని కంపెనీ ఖాతా పుస్తకాల, డేటా మదింపు వీలు కావడం లేదని చెప్పారు. ఫలితంగా జూన్‌ 30తో ముగిసిన క్వార్టర్‌కు సంబంధించిన ఆర్థిక ఫలితాలు ఇంకా సిద్ధం కాలేదని వివరించారు. వీలైనంత త్వరగా అన్ని అంశాలను సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయనున్నామని ఆయన స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు హామీ ఇచ్చారు. 



You may be interested

ఆమ్‌టెక్‌ ఆటో లిక్విడేషన్‌కు ఎన్‌సీఎల్‌టీ గ్రీన్‌సిగ్నల్‌

Saturday 17th August 2019

న్యూఢిల్లీ: ఆమ్టెక్‌ ఆటో లిక్విడేషన్‌ (ఆస్తుల విక్రయం)కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ వ్యాపారాన్ని మూసేసి, ఆస్తులను విక్రయించగా వచ్చిన నిధులను రుణాలిచ్చిన సంస్థలకు చెల్లించడమే లిక్విడేషన్‌. సదరు కంపెనీ రిజిస్ట్రేషన్‌ కూడా రద్దవుతుంది. ఆమ్టెక్‌ ఆటో దివాలా పరిష్కార ప్రక్రియకు ఇచ్చిన గడువును పొడిగించాలంటూ రుణాలిచ్చిన సంస్థలు చేసిన విజ్ఞప్తిని ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చింది. ఆర్‌బీఐ 2017లో దివాలా చర్యలు చేపట్టాలంటూ

టారిఫ్‌ నిబంధనలు దుర్వినియోగం చేశారు

Saturday 17th August 2019

బ్రాడ్‌కాస్టర్స్‌, డీపీవోలపై ట్రాయ్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: టీవీ చానళ్ల సిసలైన మార్కెట్‌ రేటును కనుగొనేందుకు లేకుండా బ్రాడ్‌కాస్టర్స్‌, ఆపరేటర్లు (డీపీవో) కొత్త టారిఫ్ ఆర్డరును దుర్వినియోగం చేశారంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ వ్యాఖ్యానించింది. చానళ్ల ఎంపిక, చార్జీలపరంగా కొత్త సమస్యలపై సంబంధిత వర్గాలు అభిప్రాయాలు తెలపాలంటూ కోరింది. టీవీ రంగంలో వ్యాపార ప్రక్రియలు క్రమబద్ధీకరించేందుకు, వివిధ వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు, చానళ్ల చార్జీల విషయంలో పారదర్శకత తెచ్చేందుకు

Most from this category