News


జెట్‌ దివాలాపై నేటి నుంచి విచారణ

Thursday 20th June 2019
news_main1561014754.png-26437

  • పార్టీలుగా చేర్చాలని ఎన్‌సీఎల్‌టీకి పైలట్లు, ఇంజినీర్ల వినతి

ముంబై: రుణ సంక్షోభంతో కుప్పకూలిన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌ దివాలాకు సంబంధించిన పిటిషన్‌పై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) గురువారం నుంచి విచారణ జరపనుంది. తాజాగా ఇందులో తమను కూడా పార్టీలుగా చేర్చాలని జెట్ ఎయిర్‌వేస్ పైలట్లు, ఇంజినీర్ల యూనియన్లతో పాటు నెదర్లాండ్స్‌కి చెందిన రెండు లాజిస్టిక్స్ వెండింగ్‌ సంస్థలు కూడా ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాయి. తాము ఇంటర్‌వెన్షన్ పిటీషన్ వేసేందుకు అనుమతించాలని వెండార్లు కోరారు. జెట్‌ భారీగా బాకీ పడటంతో దానికి లీజుకిచ్చిన విమానాలను ఈ ఏడాది మార్చిలో అమ్‌స్టర్‌డామ్‌ ఎయిర్‌పోర్టులో ఈ రెండు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే, ఈ సంస్థల పేర్లు ఇంకా వెల్లడి కాలేదు. ఏప్రిల్ 17 నుంచి జెట్ కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 8,500 కోట్ల రుణాలు రాబట్టుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సారథ్యంలోని 26 బ్యాంకుల కన్సార్షియం.. జెట్‌ ఎయిర్‌వేస్‌పై ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాయి. జెట్‌ ఎయిర్‌వేస్ దాదాపు 23,000 ఉద్యోగులకు రూ. 3,000 కోట్లు జీతాలు, ఇతరత్రా విమానాల వెండార్లు, లెస్సర్లకు (లీజుకిచ్చిన సంస్థలు) రూ. 10,000 కోట్ల దాకా బాకీ పడింది. 
మోసర్‌ బేయర్‌ ఆస్తుల విక్రయానికి ఆదేశం...
నిర్దిష్ట గడువులోగా రుణ పరిష్కార ప్రణాళికకు రుణ దాతల నుంచి ఆమోదం పొందడంలో విఫలమైనందున మోసర్‌ బేయర్‌ సోలార్‌ ఆస్తులు విక్రయించాలంటూ ఎన్‌సీఎల్‌టీ మరో కేసులో ఆదేశించింది. ఇందులో భాగంగా కంపెనీకి లిక్విడేటర్‌గా అరవింద్‌ గర్గ్ వ్యవహరిస్తారని సూచించింది. లిక్విడేషన్ ప్రక్రియ జరిగే సమయంలో కంపెనీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా గర్గ్ చూస్తారని పేర్కొంది. లిక్విడేషన్ ప్రకటన తేదీ నుంచి 75 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని లిక్విడేటర్‌కు ఎన్‌సీఎల్‌టీ సూచించింది. 2017 నవంబర్‌ 14న సెంట్రల్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిటీషన్‌ను స్వీకరించడంతో మోసర్‌ బేయర్‌ సోలార్‌పై దివాలా చట్టం కింద చర్యల ప్రక్రియ ప్రారంభమైంది. సంస్థ లిక్విడేషన్ విలువ రూ. 72.42 కోట్లుగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. మోసర్‌ బేయర్‌ సోలార్ మాతృ సంస్థ మోసర్‌ బేయర్ ఇండియా కూడా లిక్విడేషన్ ప్రక్రియ ఎదుర్కొంటోంది. 



You may be interested

మహీంద్రా వాహన రేట్ల పెంపు

Thursday 20th June 2019

రూ. 36,000 దాకా పెరుగుదల జూలై 1 నుంచి అమల్లోకి న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) వివిధ రకాల వాహనాల రేట్లను రూ. 36,000 దాకా పెంచనుంది. జూలై 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. ప్యాసింజర్ వాహనాల్లో ఏఐఎస్‌ 145 భద్రతా ప్రమాణాల నిబంధనలు అమల్లోకి వస్తుండటంతో రేట్ల పెంపు అనివార్యమవుతోందని కంపెనీ వెల్లడించింది. స్కోర్పియో, బొలెరో, టీయూవీ300, కేయూవీ100 ఎన్‌ఎక్స్‌టీ మోడల్స్‌పై

బ్లాక్‌స్టోన్‌ చేతికి వన్‌ బీకేసీ బిల్డింగ్‌

Thursday 20th June 2019

డీల్‌ విలువ రూ.2,500కోట్లు  దేశీ ఆఫీస్‌ స్పేస్‌ సెగ్మెంట్లో ఇదే అతిపెద్ద డీల్‌ ముంబై: అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ, బ్లాక్‌స్టోన్‌... ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌(బీకేసీ)లో ఉన్న ఎనిమిది అంతస్తుల వన్‌ బీకేసీ బిల్డింగ్‌లో దాదాపు సగం ఆఫీస్‌ స్పేస్‌ను కొనుగోలు చేసింది. రేడియస్‌ డెవలపర్‌ నుంచి వన్‌ బీకేసీలో 0.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ ఆఫీస్‌ స్పేస్‌ను బ్లాక్‌స్టోన్‌ సంస్థ రూ.2,500 కోట్లకు కొనుగోలు చేసింది. దేశీయ ఆఫీస్‌ స్పేస్‌

Most from this category