News


జెట్‌ ఎయిర్‌వేస్‌పై ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తు?

Friday 10th May 2019
news_main1557470133.png-25648

  • కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఆదేశించే అవకాశం
  • నిబంధనల ఉల్లంఘనను గుర్తించిన ఆర్‌వోసీ

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌లో నిధుల మళ్లింపు, పెట్టుబడుల మాఫీ వంటి చర్యలపై తీవ్ర మోసాలకు సంబంధించి దర్యాప్తు విభాగం (ఎస్‌ఎఫ్‌ఐవో) విచారణకు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖాతాలను ప్రాథమికంగా పరిశీలించిన రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ) ముంబై విభాగం... కంపెనీల చట్టం నిబంధనలు ఉల్లంఘించినట్టు, లెక్కల్లోని రాని పెట్టుబడులను గుర్తించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఈ కేసును ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తునకు నివేదించే అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. ఆర్‌వోసీ ముంబై విభాగం జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖాతాల తనిఖీకి సంబంధించి ఇప్పటికే కార్పొరేట్‌ శాఖకు నివేదిక కూడా సమర్పించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ పలు సబ్సిడరీలకు సంబంధించి మాఫీ చేసిన పెట్టుబడులపై ఎస్‌ఎఫ్‌ఐవో దృష్టి సారించనుంది. ఈ నిధులు ఎక్కడికి చేరాయన్నదీ ఆరా తీయనున్నట్టు అధికార వర్గాల సమాచారం. అప్పటి వరకు మంచి లాభాలు ప్రకటించి, ఉన్నట్టుండి 2018లో నష్టాలు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందన్న అంశాన్ని గుర్తించేందుకు కంపెనీ యాజమన్యాన్ని సైతం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరే అవకాశం ఉన్నట్టు తెలిపాయి. అరవింద్‌ గుప్తా అనే ప్రజా వేగు ఇచ్చిన ఫిర్యాదులో... జెట్‌ఎయిర్‌వేస్‌ ప్రమోటర్లు రూ.5,125 కోట్లను కంపెనీ ఖాతాల నుంచి కొల్లగొట్టే ‍ప్రయత్నం చేసినట్టు పేర్కొన్నారు. ఆడిట్‌ కమిటీ సైతం నిధుల మళ్లింపును నిరోధించలేకపోయిందన్నారు. జెట్‌ ఎయిర్‌వేస్‌, జెట్‌లైట్‌ బ్రాండ్లు ప్రమోటర్లకు చెందిన కంపెనీలతో లావాదేవీలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే ఆర్‌వోసీ ముంబై విభాగం ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయగా, తదుపరి పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ఎస్‌ఎఫ్‌ఐవో రంగంలోకి దిగనుంది. ఐసీఐసీఐ-వీడియోకాన్‌ రుణాల కేసులోనూ అక్రమాలను బయటపెట్టింది అరవింద్‌ గుప్తాయే కావడం గమనార్హం. 



You may be interested

ఎస్‌బీఐ ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Friday 10th May 2019

మార్చి త్రైమాసిక ఫలితాలను ఎస్‌బీఐ శుక్రవారం ప్రకటించనుంది. నికర వడ్డీ ఆదాయంలో రెండంకెల వృద్ధి, ప్రొవిజన్లు తగ్గడంతో బ్యాంకు మంచి లాభాలను చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. క్యు4లో బ్యాంకు రూ.5-7వేల కోట్ల లాభాలన్ని ‍ప్రకటించవచ్చని బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. అంతకుముందేడాది ఇదే కాలానికి బ్యాంకు రూ. 7718 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. బ్యాంకు ఫలితాలపై వివిధ సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి.. - నార్నోలియా సెక్యూరిటీస్‌: లాభం 53 శాతం పెరిగి

ఓటీటీ దిగ్గజంగా భారత్‌

Friday 10th May 2019

2022 నాటికి టాప్‌ 10లో చోటు రూ. 5 వేల కోట్లకు మార్కెట్‌ అసోచాం–పీడబ్ల్యూసీ అధ్యయనం న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ దేశీ వీడియో ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) మార్కెట్‌ 2022 నాటికి అంతర్జాతీయంగా టాప్‌ 10 మార్కెట్లలో ఒకటిగా ఎదగనుంది. అప్పటికి భారత వీడియో ఓటీటీ మార్కెట్‌ పరిమాణం 823 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ. 5,363 కోట్లు) చేరనుంది. పరిశ్రమల సమాఖ్య అసోచాం, కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ సంయుక్తంగా

Most from this category