News


జెట్‌లో బ్యాంకులకు వాటా

Wednesday 30th January 2019
Markets_main1548823947.png-23892

  • రుణాలను వాటాగా మార్చడానికి...!
  • మరికొన్ని ప్రతిపాదనలకు  ఆమోదం కోసం

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్‌) వచ్చే నెల 21న జరగనున్నది. ఈ ఈజీఎమ్‌లో రుణాలను ఈక్విటీగా మార్చడం, ఆధీకృత మూలధనం పెంపు, తదితర ప్రతిపాదనలకు జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ వాటాదారుల ఆమోదం కోరనున్నది. నిధుల సమస్య తీవ్రంగా ఉండటంతో రుణదాతలు ఇచ్చిన రుణాలను మొత్తంగా గానీ, పాక్షికంగా గానీ ఈక్విటీగా గానీ, కన్వర్టబుల్‌ డిబెంచర్లుగా గానీ  లేదా ఇతర సెక్యూరిటీలగా మార్చాలని  కంపెనీ భావిస్తోంది. కంపెనీకి, రుణ దాతల మధ్య కుదిరిన ఒప్పందం బట్టి ఈ మార్పిడి అధారపడి ఉంటుంది. అంతే కాకుండా పరిస్థితులను బట్టి సమయానుకూలంగా మరి‍న్ని రుణ సమీకరణలకు కూడా ఈ కంపెనీ వాటాదారుల ఆమోదం కోరుతోంది. ఈ రుణాలు రూ.25,000 కోట్లు మించకుండా ఉండాలనేది కంపెనీ ఆలోచన. మరోవైపు ప్రస్తుతం రూ.200 కోట్లుగా ఉన్న ఆధీకృత వాటా మూలధనాన్ని రూ.2,200 కోట్లకు పెంచాలని కూడా కంపెనీ నిర్ణయించింది. అంతేకాకుండా రుణాలు ఇచ్చిన సం‍స్థలు, నామినీ డైరెక్టర్లను, లేదా డైరెక్టర్ల బోర్డ్‌లో పరిశీలకులను నియమించడానికి గాను కంపెనీ నిబంధనావళిలో కూడా మార్పులు చేయాలని కంపెనీ ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనలన్నింటికీ వాటాదారుల ఆమోదం కోసం జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీ వచ్చే నెల 21న ఈజీఎమ్‌ను నిర్వహిస్తోంది.
ఎస్‌బీఐకు 15 శాతం వాటా !
రుణాలను వాటాగా మార్చిన పక్షంలో జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఎస్‌బీఐ వాటా 15 శాతంగా ఉండే అవకాశాలున్నాయి. ఎస్‌బీఐతో సహా ఇతర రుణదాతల వాటా 30 శాతంగా ఉండొచ్చని మంగళవారం టీవీ చానెళ్లు వార్తలు ప్రసారం చేశాయి. ఇతిహాద్‌ ఎయిర్‌వేస్‌ తన వాటాను ప్రస్తుతమున్న 24 శాతం నుంచి 40 శాతానికి పెంచుకునే అవకాశాలున్నాయని కూడా ఈ వార్తలు పేర్కొన్నాయి.You may be interested

ఎన్‌సీఎల్‌టీలో రుయాలకు చుక్కెదురు

Wednesday 30th January 2019

ఎస్సార్‌ స్టీల్‌ రుణాలను తీర్చివేస్తామన్న పిటిషన్‌ తిరస్కరణ న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ రుణ బకాయిలను తీర్చివేస్తామంటూ రుయా కుటుంబం దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అహ్మదాబాద్‌ బెంచ్‌ తిరస్కరించింది. ఎస్సార్‌ స్టీల్‌ ప్రమోటర్ల ప్రణాళికను ఆమోదించొద్దన్న రుణదాతల అభ్యర్థన చట్టవిరుద్ధం కాదని ఎన్‌సీఎల్‌టీ స్పష్టం చేసింది. దీంతో ఎస్సార్‌ స్టీల్‌ను కాపాడుకోవాలన్న రుయాల ‍ప్రయత్నాలకు చుక్కెదురు అయింది. అదే సమయంలో ఎస్సార్‌ స్టీల్‌ను విక్రయించడం ద్వారా

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్కామ్‌పై విచారణ జరిపించాలి

Wednesday 30th January 2019

-మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా డిమాండ్‌ -ఇది దురుద్దేశపూరితం: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ న్యూఢిల్లీ: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన విషయమై విచారణ జరిపించాలని మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా డిమాండ్‌ చేశారు. తక్షణం ఈ విషయమై ప్రభుత్వం విచారణ జరపకపోతే  ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కోర్టు పర్యవేక్షణలో సిట్‌తో దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. వేలాది డొల్ల కంపెనీలను రద్దు చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోందని,

Most from this category