News


జెట్‌కు కొత్త బిడ్డర్లు దూరం

Wednesday 4th September 2019
news_main1567577556.png-28184

  • బిడ్ల దాఖలుకు మూడోసారి ముగిసిన డెడ్‌లైన్
  • ఇక రేసులో మూడే సంస్థలు

ముంబై: దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేసే రేసులో మూడే సంస్థలు మిగిలాయి. విక్రయానికి గడువు మూడుసార్లు పొడిగించినప్పటికీ కొత్త బిడ్డర్లెవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. "మూడోసారి పెంచిన గడువు ఆగస్టు 31తో ముగిసింది. కానీ కొత్తగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలేమీ (ఈవోఐ) రాలేదు. డెడ్‌లైన్‌ను ఇక మరింత పొడిగించే అవకాశాలు లేవు. దీంతో ఇప్పటిదాకా వచ్చిన మూడు సంస్థలతోనే విక్రయ ప్రక్రియ కొనసాగవచ్చు" అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈవోఐలు దాఖలు చేసిన వాటిల్లో రష్యాకు చెందిన రష్యన్ ఫండ్ ట్రెజరీ ఆర్‌ఏ పార్ట్‌నర్స్‌, పనామాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అవాంట్యులో గ్రూప్‌, దక్షిణ అమెరికా దిగ్గజం సినర్జీ గ్రూప్‌ ఉన్నాయి. దాదాపు రూ. 26,000 కోట్ల మేర రుణ భారం పేరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ ఈ ఏడాది ఏప్రిల్‌లో కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. దివాలా ప్రక్రియలో భాగంగా సంస్థను విక్రయించేందుకు ఆగస్టు 3, 10, 31 దాకా మూడు సార్లు బ్యాంకులు గడువు పొడిగించాయి. ముందుగా పారిశ్రామిక దిగ్గజం అనిల్ అగర్వాల్ కుటుంబానికి చెందిన వల్కన్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఆసక్తి చూపినప్పటికీ.. తర్వాత పక్కకు తప్పుకుంది. జెట్‌లో 24 శాతం వాటాలు ఉన్న ఎతిహాద్ ఎయిర్‌వేస్‌ కొత్తగా బిడ్స్‌ వేయలేదు. 



You may be interested

రాణిస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌..ఫార్మా ఇండెక్స్‌ డౌన్‌

Wednesday 4th September 2019

దేశ జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోవడంతో దేశియ ఈక్విటీ మార్కెట్లు గత కొన్ని సెషన్‌ల నుంచి నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ బుధవారం సెషన్‌లో మధ్యాహ్నాం 12.06 సమయానికి 1.98 శాతం నష్టపోయి 7,818.70 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కాగా ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్‌ షేర్లయిన దివిస్‌ ల్యాబ్‌ 1.83 శాతం, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లి. 1.26 శాతం నష్టపోయి ట్రేడవుతుండగా, డా. రెడ్డీస్‌

అంతర్జాతీయ బ్రోకరేజీల నుంచి టాప్‌ సిఫార్సులు

Wednesday 4th September 2019

వివిధ స్టాకులపై అంతర్జాతీయ బ్రోకరేజిల సిఫార్సులు: బ్రోకరేజి: మోర్గాన్‌ స్టాన్లీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్టాకుపై మోర్గాన్‌ స్టాన్లీ ‘ఓవర్‌ వెయిట్‌’ కొనసాగిస్తు, టార్గెట్‌ ధరను రూ. 3,000 గా నిర్ణయించింది. జూన్‌ త్రైమాసిక ఫలితాల తర్వాత ఈ స్టాకు దిద్దుబాటుకు గురయ్యిందని, ప్రస్తుతం ఈ స్టాకు ఆకర్షిణయమైన వాల్యుషన్‌ దగ్గర లభిస్తోందని ఈ బ్రోకరేజి తెలిపింది. బ్రోకరేజి: గోల్డ్‌మాన్‌ సాచ్స్‌ గోల్డ్‌మాన్‌ సాచ్స్‌, హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌) స్టాకుపై ‘సెల్‌’ కాల్‌ను కొనసాగిస్తు, టార్గెట్‌ ధరను రూ.

Most from this category