STOCKS

News


రూ.1,170 కోట్ల ఇల్లు కొన్న అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌

Thursday 13th February 2020
news_main1581575367.png-31755

ప్రపంచంలో సంపన్న వ్యక్తి , అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌ అత్యంత ఖరీదైన ఎస్టేట్‌ను కొనుక్కున్నారు.లాస్‌ ఏంజిల్స్‌లోని బేవర్లీ హిల్స్‌లో ఉన్న  మీడియా మొఘల్‌ డేవిడ్‌ గెఫెన్‌కు చెందిన వార్నర్‌ ఎస్టేట్‌ను 165 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసినట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. మన భారత కరెన్సీలో అక్షరాల 1,170 కోట్ల రూపాయలు.  ఈ కొనుగోలు లాస్‌ ఏంజిల్స్‌లోనే  రికార్డు సృష్టించిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికంటే ముందు ఉన్న రికార్డు మీడియా ఎక్సిక్యూటివ్‌ అయిన లాల్చన్‌ ముర్డోక్‌ పేరు మీద ఉంది. లాల్చన్‌  లాస్‌ ఏంజిల్స్‌లోని బెల్‌ ఎయిర్‌ ఎస్టేట్‌లో ఉన్న క్లెంపెట్‌ రెసిడెన్స్‌ను ‘‘ద బెవర్లీ హిల్‌బిల్లీస్‌’’ అనే టీవీ షో కోసం 150 మిలియన్‌ డాలర్లు(రూ.1,065 కోట్లు) వెచ్చించి కొన్నారు. కాగా 1990లో డేవిడ్‌ గెఫెన్‌ వార్నర్‌ బ్రదర్స్‌లో ఒకరైన జాక్‌ వార్నర్‌ నుంచి 9.4 ఎకరాల ఎస్టేట్‌ను 47.5 మిలియన్‌డాలర్ల(రూ.337.25 కోట్లు)కు కొన్నాడు. ఈ మధ్యనే ఫోర్బ్స్‌ సంస్థ జెఫ్‌ బెజోస్‌కు ఉన్న ఆస్తుల విలువ 131 బిలియన్‌ డాలర్లుగా (రూ.930,100 కోట్లు) అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే బెజోస్‌ గత కొంతకాలంగా కొత్త ఇంటికోసం వెతుకుతున్నట్లు న్యూయార్క్‌ పోస్ట్‌లో ఒక వార్త వెలువడినప్పటికీ, ప్రస్తుతం కొన్న ఎస్టేట్‌ను ఇంటికి కోసం వినియోగిస్తారా? లేదా అనేది బెజోస్‌ అధికారికంగా వెల్లడించలేదు.



You may be interested

నిఫ్టీ కన్నా మేలైన రాబడినిచ్చిన పీఎంఎస్‌ పథకాలు

Thursday 13th February 2020

కరోనా వైరస్‌ భయాలు, బడ్జెట్‌పై ఊహాగానాలతో జనవరినెల మార్కెట్లు ప్రాఫిట్‌ బుకింగ్‌ చూశాయి. నిఫ్టీ జనవరిలో దాదాపు 2 శాతం పతనమైంది. కానీ ఇదే నెల్లో 100కు పైగా పీఎంఎస్‌ పథకాలు నిఫ్టీ కన్నా మంచి రాబడులు ఇచ్చాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 115 పోర్టుఫోలియో మేనేజ్‌మెంట్‌ పథకాలు పాజిటివ్‌ రాబడులు ఇచ్చాయి. వీటిలో టాప్‌ 8 పథకాలు దాదాపు 10 శాతం కన్నా ఎక్కువ రాబడినిచ్చాయని పీఎంఎస్‌ బజార్‌

టీసీఎస్‌, ఇన్ఫీ అప్‌

Thursday 13th February 2020

నష్టాల మార్కెట్లోనూ గురువారం  ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లోనే అరశాతం లాభపడింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పుంజుకోవడంతో దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనపడింది. డాలర్‌ మారకంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ షేర్లకు ఈ అంశం కలిసొచ్చింది.  దీంతో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే

Most from this category