News


భారత్‌పై డబ్ల్యూటీఓకు జపాన్‌

Wednesday 15th May 2019
news_main1557901946.png-25749

  • దిగుమతి సుంకాలపై వివాదాలు

న్యూఢిల్లీ: కొన్ని ఉత్పత్తుల దిగుమతులపై  భారత్‌ పరిమితికి మించి సుంకాల విధిస్తోందంటూ జపాన్‌ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)ను ఆశ్రయించింది. డబ్ల్యూటీఓ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.  దీనిప్రకారం, 2014 సెప్టెంబర్‌లో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమ ప్రకటన అనంతరం ‘ఒక పద్దతి ప్రకారం, క్రమంగా’ జపాన్‌ నుంచి కొన్ని వస్తువుల దిగుమతులపై భారత్‌ సుంకాలను పెంచుతూ వస్తోంది. వీటిలో ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్స్‌, మైనింగ్‌, ఆటోమొబైల్స్‌, సాంప్రదాయేతర ఇంధనం, రక్షణ పరికరాలు, ఆహారం, ప్రాసెసింగ్‌, ఆటోమొబైల్‌ విడిభాగాలు, జౌళి, దుస్తులు ఉన్నాయి. అంతర్జాతీయ నిబంధనల నిర్దేశిత రేట్ల కన్నా ఈ సుంకాలు అధికంగా ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి డబ్ల్యూటీఓ వివాద పరిష్కార యంత్రాంగం కింద భారత్‌తో సంప్రతింపులను జపాన్‌ కోరుతోంది. వివాద పరిష్కార దిశలో ఇది తొలి అడుగు. 60 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉంటుంది.  ఈ సంప్రతింపులు విఫలం అయితే, ఒక న్యాయ నిపుణుల బృందం ఏర్పాటుకు ఫిర్యాదుదారు అభ్యర్థించవచ్చు.  2017-18లో భారత్‌-జపాన్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ 15.7 బిలియన్‌ డాలర్లు. ఇందులో భారత్‌కు జపాన్‌ నుంచి దిగుమతుల విలువే అధికంగా ఉండడం గమనార్హం. 



You may be interested

ఏడాది కనిష్టానికి యస్‌ బ్యాంక్‌

Wednesday 15th May 2019

యస్‌ బ్యాంకు షేర్లు బుధవారం ఏడాది కనిష్టానికి పతనమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో రూ.154.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపడంతో 6శాతం నష్టంతో రూ. 146.85ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. ఈ ధర షేరు ఏడాది కనిష్ట ధరని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. యస్ బ్యాంక్ అదనపు డైరెక‍్టరుగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మాజీ డిప్యుటీ గవర్నర్ ఆర్ గాంధీ నియమితులమైన సంగతి

చందా కొచర్‌ దంపతులు మళ్లీ ఈడీ ముందుకు

Wednesday 15th May 2019

వరుసగా రెండో రోజూ విచారణ న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల కుంభకోణం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్‌లను వరుసగా రెండో రోజు మంగళవారం కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేసింది. ఉదయం 11.30 గం.ల సమయంలో వారు హాజరైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటిదాకా విచారణ ముంబైలోనే జరగ్గా ప్రస్తుతం వేదిక ఢిల్లీకి మారడం గమనార్హం. సోమవారం జరిగిన విచారణలో

Most from this category