News


సోమవారం జలాన్‌ కమిటి నివేదిక సమర్పణ

Saturday 24th August 2019
news_main1566640134.png-27993

 జలాన్‌ ప్యానెల్‌ సోమవారం తన నివేదికను ఆర్‌బీకి సమర్పించనుంది. ఆర్‌బీఐ బోర్డు కూడా అదే రోజూ నుంచి పరిగణలోకి తీసుకోంది. ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద స్థూల ఆస్తుల్లో 28 శాతానికి సమానమైన (రూ.9 లక్షల కోట్లు) మిగులు నిధులున్నాయి. ఆర్‌బీఐ వద్ద ఉన్న మొత్తం ఈ రూ.9లక్షల కోట్ల నిధుల్లో రూ.3లక్షల కోట్లను తమకు బదలాయించుకోవాలని కేంద్రం పట్టుపట్టింది. అయితే నాటి ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ దీనికి అంగీకరించలేదు. ఆర్‌బీఐ వద్ద ఉన్న మిగులు నిధులను వినియోగం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన డివిడెండ్లను సిఫార్సు చేసేందుకుగాను గతేడాది డిసెంబర్‌లో బిమల్‌ జలాన్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందుకు 90రోజుల పాటు కాలపరిమితి విధించింది. అయితే నివేదిక పూర్తి కావస్తున్న తరుణంలో ఈ కమిటీలో సభ్యుడైన ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ను కేంద్రం విద్యుత్‌ శాఖకు బదిలీ చేసింది. దాంతో ప్రభుత్వం కమిటీ నివేదికను మరికొంతకాలం పొడిగించాల్సి వచ్చింది. ప్రజా రుణాన్ని తగ్గించడం, ప్రభుత్వ బ్యాంకుల రీక్యాపిటలైషన్‌ కోసం ఆర్‌బీఐ బదలాయించే మిగులు నిధుల వినియోగిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే పీఎస్‌యు క్యాపిటలైజేషన్‌లో భాగంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.70వేల కోట్లు ప్రకటించారు. ఈ నిధులు వ్యవస్థలో రూ .5 లక్షల కోట్ల లిక్విడిటీని విడుదల చేయటానికి వీలు కల్పిస్తుంది.



You may be interested

మార్కెట్‌ ఉత్సాహానికి ట్రేడ్‌ వార్‌ అడ్డంకి?

Saturday 24th August 2019

ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆర్థిక చర్యల ప్రభావం మార్కెట్‌పై సోమవారం పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉంది. కానీ ఈ మార్కెట్‌ ఉత్సాహాన్ని తీవ్రతరమవుతున్న యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ తగ్గించవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మార్కెట్‌ల బౌన్స్‌బ్యాక్‌కు ఈ ట్రేడ్‌ వార్‌ అడ్డంకి కాగలదని వారు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న 550 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులపై అదనంగా 5 శాతం టారీఫ్‌లను విధించనున్నామని శుక్రవారం ప్రకటించడంతో

మార్కెట్‌ ట్రెండ్‌ రివర్స్‌ అవుతుంది

Saturday 24th August 2019

-విశ్లేషకుల అంచనా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ప్రకటించిన ఆర్థిక చర్యలపై మార్కెట్‌ వర్గాలు సంతృప్తిగా ఉన్నాయి. ఇది దేశ ఆర్థిక మందగమనాన్ని నిలువరించగలదని అభిప్రాయపడ్డాయి. ఈ ఉద్దీపన చర్యల కారణాన సోమవారం మార్కెట్‌ పెద్ద గ్యాప్‌ అప్‌తో ప్రారంభమవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎఫ్‌పీఐ, డీఐఐలపై అదనపు సర్‌చార్జీని ఉపసంహరించడం, తక్షణమే ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనాన్ని సమకూర్చడం వంటి ప్రతిపాదనలను శుక్రవారం ఆర్థిక మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.

Most from this category