News


జగన్‌! మీరు యువతకు స్ఫూర్తి

Wednesday 24th July 2019
news_main1563950116.png-27271

  • షావొమి ఎండీ మను జైన్‌ ట్వీట్‌

‘‘జగన్‌ గారూ!! నేటి యువతకు మీరో స్ఫూర్తి. రాష్ట్రానికి సంబంధించి మీ విజన్‌ను పూర్తిగా విన్నాక నాలో చాలా ఉత్తేజం కలిగింది. ఇదో అద్భుతమైన సమావేశం’’ అంటూ మొబైల్‌ దిగ్గజం షావొమి గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, కంపెనీ ఇండియా ఎండీ మనుకుమార్‌ జైన్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. సోమవారం ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఏపీలో మరో ప్లాంటు ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరిచిన మను జైన్‌... ఆ భేటీ తాలూకు వివరాలు, ఫోటోలతో మంగళవారం కొన్ని ట్వీట్లు చేశారు. ‘‘ఆయన చాలా సింపుల్‌గా, సాదాసీదాగా కనిపిస్తారు. కానీ అద్భుతమైన ఆత్మవిశ్వాసం ఉంది. ఆయన్నుంచి మేం చాలా నేర్చుకున్నాం. ఉత్తేజం పొందాం’’ అంటూ మరో ట్వీట్‌ కూడా చేశారు. సోమవారం నాటి చర్చల్లో మేకిన్‌ ఇండియాలో భాగంగా పలు ఉపకరణాలు ఇక్కడే తయారు చెయ్యడానికి ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రితో షావొమి బృందం చర్చించింది.



You may be interested

హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,795 కోట్లు

Wednesday 24th July 2019

14 శాతం వృద్ధి 6 శాతం వృద్ధితో రూ.10,197 కోట్లకు నికర అమ్మకాలు  న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలివర్‌(హెచ్‌యూఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.1,795 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.1,569 కోట్లతో పోల్చితే 14 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్‌ తెలిపింది. అమ్మకాలు పెరగడం, మార్జిన్ల మెరుగుదల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో

ఇల్లు గెలిచింది...!!

Wednesday 24th July 2019

రిజిస్ట్రేషన్ రద్దు ప్రమోటర్లపై విచారణకు ఈడీకి ఆదేశం పెండింగ్ ప్రాజెక్టుల బాధ్యత ఎన్‌బీసీసీకి అప్పగింత 42 వేల మంది గృహ కొనుగోలుదారులకు ఊరట న్యూఢిల్లీ: గృహాల కొనుగోలుదారులకు సకాలంలో ఇళ్లు అందించకుండా సతాయించే బిల్డర్లకు షాకిచ్చేలా రియల్టీ దిగ్గజం ఆమ్రపాలి గ్రూప్ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కింద ఉన్న సంస్థ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతను నేషనల్ బిల్డింగ్స్

Most from this category