News


వాణిజ్యవేత్తగా విఫలమయ్యా: కేఫ్‌ కాఫీడే అధిపతి

Tuesday 30th July 2019
news_main1564485364.png-27418

గత రాత్రి నుంచి కన్పించకుండాపోయిన కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ రెండు రోజుల క్రితం రాసిన లేఖ ఒకటి బయపడింది. ఈ లేఖ సారాంశం

 

‘మా డైరెక్టర్ల బోర్డుకు, కాఫీ డే కుటుంబానికి,

నేను పెద్ద వాటాదారునిగా ఉన్న టెక్నాలజీ కంపెనీలో 37 ఏళ్ల బలమైన నిబద్ధతతో  30,000 ఉద్యోగాలను సృష్టించాను. ఉత్తమ ప్రయత్నాలు చేసినప్పటికి సరైన లాభదాయకమైన వ్యాపార నమూనాను రూపొందించడంలో విఫలమయ్యాను. నాపై నమ్మకం ఉంచిన ప్రజలందరినీ నిరాశపరిచినందుకు నన్ను క్షమించండి. నేను చివరి వరకు పోరాడాను. కానీ షేర్ల బై బ్యాక్‌ చేయమని అధికంగా ఒత్తిడి చేసే ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఒత్తిడిని మరింత తట్టుకోలేక పోయాను. గతంలో బైబ్యాక్‌చేసేందుకు ఆరు నెలల క్రితం నా స్నేహితుని నుంచి పెద్ద మొత్తంలో తీసుకున్న రుణాలు తీసుకున్నా...  రుణదాతల నుంచి వస్తున్న విపరీతమైన ఒత్తిళ్లు నన్ను ఈ పరిస్థితికి దారి తీశాయి. సవరించిన రిటర్న్‌లను దాఖలు చేసినప్పటికి మైండ్‌ట్రీ ఒప్పందాన్ని నిరోధించడానికి రెండు వేర్వేరు సందర్భాల్లో మా షేర్లను అటాచ్ చేసి, ఆపై మా కాఫీ డే షేర్లను ఆదాయపు పన్ను మాజీ డీజీ స్వాధీనం చేసుకొన్నారు. ఆయన నన్ను విపరీతంగా వేధింపులకు  గురిచేశారు.  ఈ పరిస్థితి వలన తీవ్రమైన ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. 
  బలంగా ఉన్న ఈ వ్యాపారాలను కొత్త నిర్వహణతో కొనసాగించాలని నేను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. తప్పులన్నింటికి నేను బాధ్యత వహిస్తున్నాను. ప్రతి ఆర్థిక లావాదేవీ నా కారణానే జరిగింది.  నా బృందానికి గాని, ఆడిటర్లుకు గానీ, సీనియర్ మేనేజ్‌మెంట్‌లకు కానీ నా లావాదేవీల గురించి పూర్తిగా తెలియదు. నా కుటుంబంతో సహా ప్రతిఒక్కరి నుంచి ఈ సమాచారాన్ని దాచివేశాను. అందువలన చట్టం నన్ను మాత్రమే బాధ్యునిగా చేయాలి. ఎవరినీ మోసం చేయడం లేదా తప్పుదోవ పట్టించడం నా ఉద్దేశ్యం కాదు. నేను వాణిజ్యవేత్తగా విఫలమయ్యాను. ఏదో ఒక రోజు మీరు నన్ను అర్థం చేసుకుంటారని, నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. నాకున్న ఆస్తులు  ప్రతి ఒక్కరి రుణాలను తిరిగి చెల్లించటానికి సహాయపడతాయి.

గౌరవంతో,
వి జి. సిద్ధార్థ ’You may be interested

యాక్సిస్‌ బ్యాంక్‌ క్యూ1... అంచనాలు మిస్‌..!

Tuesday 30th July 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికపు అంచనాలను ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంకు అందుకోలేకపోయింది. వార్షిక ప్రాతిపదికన బ్యాంకు ఈ క్యూ1లో రూ.1,370 కోట్ల నికరలాబాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ1లో కంపెనీ ఆర్జించిన రూ.701 కోట్ల నికరలాభాంతో పోలిస్తే ఇది 95శాతం అధికం. అయితే విశ్లేషకులు మాత్రం బ్యాంకు ఈ త్రైమాసికంలో రూ.1,850 కోట్ల నికర లాభాన్ని ఆర్జించవచ్చని అంచనావేశారు. నికర వడ్డీ ఆదాయం13శాతం వృద్ధి

దిగ్గజం అనుకుంటే.. దిగ్గున పడిపోయింది!

Tuesday 30th July 2019

భారీగా పతనమవుతున్న వొడాఫోన్‌ఐడియా షేరు ఇంకా రిస్కులున్నాయంటున్న నిపుణులు రెండేళ్ల క్రితం 2017 మార్చిలో రెండు పెద్ద టెలికం కంపెనీలు వొడాఫోన్‌, ఐడియాలు విలీన ప్రకటన చేశాయి. దేశ టెలికం రంగంలో ఈ ప్రకటన సంచలనం సృష్టించింది. ఈ విలీనంతో ఐడియా స్టాకు భారీగా వాల్యూ పెరుగుతుందని అటు మార్కెట్‌ వర్గాలు, ఇటు ఇన్వెస్టర్లు భావించారు. విలీన సమయంలో ఒప్పందంలోని ఒక నిబంధన ప్రకారం ఐడియా సెల్యులార్‌ సంస్థ ప్రమోటర్లు విలీన సంస్థలో

Most from this category