News


ఐటీఆర్‌ దాఖలుకు నేటి వరకే గడువు

Saturday 31st August 2019
news_main1567230438.png-28125

  • గడువు పొడగించలేదని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువు పొడిగించలేదని, ఈ నెల 31లోపు (శనివారం) కచ్చితంగా దాఖలు చేయాల్సిందేనని ఆదాయపన్ను శాఖ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా స్పష్టత ఇచ్చింది. ఐటీఆర్‌ దాఖలుకు గడువును ప్రభుత్వం మరో నెల పాటు పొడిగించిందటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలను ఖండించింది. ‘‘సామాజిక మాధ్యమాల్లో సీబీడీటీ గడువు పొడిగించినట్టు ప్రచారమవుతున్న ఆదేశాలు నిజం కాదు. పన్ను చెల్లింపుదారులు పొడిగించిన గడువు ఆగస్ట్‌ 31 నాటికి రిటర్నులు దాఖలు చేయాలని సూచిస్తు‍న్నాం’’ అని ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. సెప్టెంబర్‌ 30 వరకు ఐటీఆర్‌ దాఖలు గడువు పొడిగించినట్టు ఆగస్ట్‌ 29వ తేదీతో ఉన్న ఆదేశాల నకిలీ కాపీ ట్విట్టర్‌, వాట్సాప్‌ వంటి వేదికలపై హల్‌ చల్‌ చేస్తున్న నేపథ్యంలో ఈ వివరణ రావడం గమనార్హం. 



You may be interested

ఎస్‌బీఐ కార్డు మొబైల్‌ యాప్‌లో ఐఎల్‌ఏ

Saturday 31st August 2019

ఎస్‌బీఐ కార్డు మొబైల్‌ యాప్‌లో ఐఎల్‌ఏ ఎస్‌బీఐ కార్డ్‌ సంస్థ తన మొబైల్‌ యాప్‌లోకి చాట్‌బాట్‌ ఐఎల్‌ఏ (ఇంటరాక్టివ్‌ లైవ్‌ అసిస్టెంట్‌) ను ప్రవేశపెట్టింది. కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని తీసుకురావడమే దీన్ని ఉద్దేశ్యం. 40కు పైగా వినూత్నమైన స్వయం సేవ ఫీచర్లతో ఉన్న ఐఎల్‌ఏను ఆఫర్‌ చేస్తున్న తొలి సంస్థగా ఎస్‌బీఐ కార్డు నిలుస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఈఎంఐ కన్వర్షన్‌, బ్యాలన్స్‌ బదిలీ, క్రెడిట్‌ కార్డుపై రుణం, ఇతర అకౌంట్‌

చత్తీస్‌గఢ్‌ స్టీల్‌ ప్లాంట్‌ 2020లో రెడీ

Saturday 31st August 2019

ఎన్‌ఎండీసీ సీఎండీ బైజేంద్ర కుమార్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- మైనింగ్‌ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ చత్తీస్‌గఢ్‌లో నిర్మిస్తున్న స్టీల్‌ ప్లాంటు పనులు చకచకా సాగుతున్నాయి. ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3 మిలియన్‌ టన్నులు. 2020 అక్టోబరు-డిసెంబరులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని సంస్థ సీఎండీ ఎన్‌.బైజేంద్ర కుమార్‌ శుక్రవారం జరిగిన 61వ వార్షిక సాధారణ సమావేశంలో వెల్లడించారు. ‘చత్తీస్‌గఢ్‌ స్టేట్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో కలిసి కొత్త గనుల అభివృద్ధి

Most from this category