News


పార్క్‌ హయత్‌లో ఐవోటీ ఆధారిత వాటర్‌ ప్లాంట్‌

Wednesday 11th December 2019
news_main1576035067.png-30164

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రముఖ హాస్పిటాలిటీ కంపెనీ హయత్‌ హోటల్స్‌ కార్పొరేషన్‌ దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) ఆధారిత వాటర్‌ ప్యూరిఫికేషన్, గాజు బాటిల్స్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ‘వాటర్‌హెల్త్‌ ఇండియా’తో ఒప్పందం చేసుకుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను పునర్వినియోగించడం, నీటిని ఆదా చేయడం ఈ యూనిట్‌ ప్రత్యేకతని పార్క్‌ హయత్‌ సౌత్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ థామస్‌ అబ్రహం మంగళవారమిక్కడ విలేకరులతో చెప్పారు. ప్రస్తుతం హయత్‌కు దేశంలో 30 హోటల్స్‌ ఉన్నాయి. వాటర్‌హెల్త్‌ సీఓఓ వికాస్‌ షా మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ఏటా 50 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ విడుదలవుతోందని, ఇది భూమిలో లేదా సముద్రాల్లో కలిసిపోతోందని చెప్పారు. ‘‘2040 నాటికి దేశంలో నీటి సంక్షోభం ఏర్పడే అవకాశముంది. ఎందుకంటే ప్రపంచ జనాభాలో మన వాటా 17 శాతం. కానీ నీటి వనరుల్లో మన వాటా 4 శాతమే’’ అని వివరించారు. 



You may be interested

డిసెంబర్15 దాకా పోర్టబిలిటీ నిలిపివేత

Wednesday 11th December 2019

ఈ నెల 16 నుంచి కొత్త ఎంఎన్‌పీ నిబంధనలు న్యూఢిల్లీ: మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) ప్రక్రియకు సంబంధించి కొత్త నిబంధనలు డిసెంబర్ 16 నుంచి అమల్లోకి రానున్నట్లు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. పాత వ్యవస్థ నుంచి కొత్త వ్యవస్థకు మారే క్రమంలో డిసెంబర్‌ 10 నుంచి 15 దాకా ఎంఎన్‌పీ సదుపాయం అందుబాటులో ఉండదని, ప్రత్యేక పోర్టింగ్ కోడ్ (యూపీసీ) కూడా జనరేట్ కాదని పేర్కొంది.

గోల్డ్‌.. క్రూడ్‌... రెండూ రయ్‌ రయ్‌!

Wednesday 11th December 2019

గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా 2020 అంచనాల పెంపు న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో కీలకమైన రెండు కమోడిటీలు- బంగారం, క్రూడ్‌ రెండూ 2020లో అప్‌ట్రెండ్‌లోనే ఉంటాయని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం- గోల్డ్‌మన్‌శాక్స్‌ అంచనా వేసింది. ఈ సంస్థ ఇంకా ఏమని చెబుతోందంటే... ‘‘అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌- న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్చేంజ్‌ (నైమెక్స్‌)లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర 2020లో సగటున 1,600 డాలర్లుగా ఉంటుంది. 2021లో కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. అంతర్జాతీయంగా ఆర్థిక

Most from this category