News


ఐటీసీ లాభం రూ.3,437 కోట్లు

Saturday 3rd August 2019
news_main1564808004.png-27514

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం ఐటీసీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో 13 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.3,049 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.3,437 కోట్లకు పెరిగిందని ఐటీసీ తెలిపింది. నికర అమ్మకాలు రూ.11,746 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.12,532 ‍కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.7,668 కోట్ల నుంచి రూ.8,114 కోట్లకు చేరాయని వివరించింది. 
డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, నిలకడైన ఆర్థిక ఫలితాలు సాధించామని ఐటీసీ తెలిపింది. ఆర్థిక ఫలితాల వివరాలు...
సిగరెట్ల విభాగం ఆదాయం రూ.5,433 కోట్లు 
ఈ కంపెనీ ప్రధాన వ్యాపారమైన సిగరెట్ల విభాగం స్థూల ఆదాయం 6 శాతం పెరిగి రూ.5,433 కోట్లకు చేరింది. ఎఫ్‌ఎమ్‌సీజీ విభాగం ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.3,060 కోట్లకు చేరింది. బ్రాండ్‌ బిల్డింగ్ కోసం అధికంగా వ్యయాలు చేయడం, కొత్త కేటగిరీల, కొత్త ప్లాంట్ల వ్యయాలు పెరిగినప్పటికీ, ఈ విభాగం నిర్వహణ లాభం 41 శాతం వృద్ధి చెంది రూ.181 కోట్లకు పెరిగింది. హోటళ్ల విభాగం ఆదాయం 15 శాతం వృద్ధితో రూ.393 కోట్లకు చేరింది. కొత్త ప్రొపర్టీలకు సంబంధించి తరుగుదల వ్యయాల అధికంగా ఉండటంతో నికర లాభం రూ.10 కోట్లకు(గత క్యూ1లో రూ.13 కోట్లు) తగ్గింది. నిర్వహణ లాభం మాత్రం 18 శాతం పెరిగింది. 



You may be interested

ప్రభుత్వ బ్యాంకుల నియమావళిని నవీకరించిన ఆర్బీఐ

Saturday 3rd August 2019

పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర శాసనసభ్యులు లేదా మునిసిపల్ కార్పొరేషన్ల వంటి స్థానిక సంస్థలలోని సభ్యులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డులలో ఉండకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నవీకరించిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రమాణాలలో పేర్కొంది. వీరితో పాటు ఏ ప్రభుత్వ రంగ బ్యాంకులోనైన చట్టబద్దమైన సెంట్రల్ ఆడిటర్లుగా పనిచేస్తున్న చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థల భాగస్వాములు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డులలో చేరడానికి అనర్హులని వివరించింది. ఈ

రూపాయికి 54 పైసల నష్టం

Saturday 3rd August 2019

69.60కు చేరిక డాలర్లకు మళ్లీ డిమాండ్‌ ముంబై: చమురు ధరల పెరుగుదల, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మళ్లీ ముదురుతోందన్న ఆందోళనలు, తరలిపోతున్న విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూపాయిపైనా గణనీయమైన ప్రభావం చూపించాయి. డాలర్లకు డిమాండ్‌ ఏర్పడడంతో శుక్రవారం డాలర్‌తో రూపాయి 54 పైసలు నష్టపోయి రూ.69.60కు చేరింది. రూపాయితోపాటు వర్ధమాన కరెన్సీలపైనా ఈ ప్రభావం పడింది. చైనాకు చెందిన 300 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులపై అదనంగా 10 శాతం టారిఫ్‌ను సెప్టెంబర్‌

Most from this category