News


ఐటీసీ లాభం రూ.4,173 కోట్లు

Friday 25th October 2019
news_main1571974090.png-29122

  • 37 శాతం వృద్ధి 
  • 6 శాతం వృద్ధితో రూ.12,759 కోట్లకు ఆదాయం 

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం ఐటీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.4,174 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం (రూ.3,045 కోట్లు)తో పోల్చితే 37 శాతం వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది. పేపర్‌ బోర్డ్స్‌, హోటళ్లు, ఎఫ్‌ఎమ్‌సీజీ ఇతర వ్యాపారాల జోరు కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని ఐటీసీ వెల్లడించింది. నికర అమ్మకాలు రూ.12,019 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.12,759 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్థూల ఆదాయం కూడా 6 శాతం వృ‍ద్ధితో రూ.11,750 కోట్లకు చేరిందని తెలిపింది. మొత్తం వ్యయాలు రూ.8,129 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.8,455 కోట్లకు పెరిగాయని పేర్కొంది. 

సిగరెట్ల వ్యాపారం ఆదాయం రూ.5,842 కోట్లు...
సిగరెట్ల వ్యాపారం ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.5,842 కోట్లకు, ఎఫ్‌ఎమ్‌సీజీ వ్యాపారం(సిగరెట్లు కలుపుకొని) 6 శాతం వృద్ధితో రూ.9,138 కోట్లకు, ఎఫ్‌ఎమ్‌సీజీ యేతర వ్యాపారాల ఆదాయం 4 శాతం పెరిగి రూ.3,286 కోట్లకు చేరాయని ఐటీసీ తెలిపింది. ఇక హోటళ్ల వ్యాపారం ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.446 కోట్లకు, వ్యవసాయ వ్యాపార విభాగం ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.2,674 కోట్లకు, పేపర్‌ బోర్డ్స్‌, పేపర్‌, ప్యాకేజింగ్‌ విభాగం ఆదాయం 10 శాతం పెరిగి రూ.1,565 కోట్లకు  పెరిగాయని పేర్కొంది. ఐటీ సేవలు, ఇతర విభాగాల వ్యాపార ఆదాయం 10 శాతం పెరిగి రూ.540 కోట్లకు చేరిందని వివరించింది. You may be interested

వ్యాపారానికి భారత్‌ భేష్‌..

Friday 25th October 2019

మరింత మెరుగుపడిన మన దేశ ర్యాంక్‌ వ్యాపార సులభతరంలో భారత్‌కు 63వ స్థానం ప్రపంచ బ్యాంక్‌ తాజా జాబితా వెల్లడి టాప్‌ 10 మెరుగైన దేశాల్లో స్థానం కొనసాగింపు వాషింగ్టన్: వ్యాపారం సులభంగా నిర్వహించేందుకు వీలున్న దేశాల జాబితాలో భారత ర్యాంక్‌ మరింత మెరుగుపడింది. ప్రపంచ బ్యాంక్‌ తాజాగా ప్రకటించిన ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ర్యాంకుల్లో మన దేశం 63వ స్థానాన్ని సొంతం చేసుకుంది. గతేడాదిలో 77వ స్థానానికి చేరి సంచలం సృష్టించిన భారత్‌..

టెల్కోలకు 'సుప్రీం' షాక్‌

Friday 25th October 2019

ఏజీఆర్‌పై ప్రతికూల తీర్పు రూ. 92వేల కోట్లు రాబట్టుకోవడానికి  కేంద్రానికి అనుమతి  ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లపై పెనుభారం న్యూఢిల్లీ: టెల్కోల రాబడి (ఏజీఆర్‌) నిర్వచనం, కేంద్రానికి చెల్లించాల్సిన లైసెన్సు ఫీజులపై టెలికం కంపెనీలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఏజీఆర్‌కు సంబంధించి టెలికం శాఖ (డాట్‌) నిర్వచనం సరైనదేనని స్పష్టం చేసింది. టెల్కోల నుంచి రూ. 92,000 కోట్లు రాబట్టుకోవడానికి డాట్‌కు అనుమతిచ్చింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా సారథ్యంలోని త్రిసభ్య బెంచ్‌ గురువారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘ఏజీఆర్‌

Most from this category