ఐటీసీ లాభంలో 19 శాతం వృద్ధి
By Sakshi

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ కంపెనీ ఐటీసీ మార్చి త్రైమాసికానికి రూ.3,482 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో లాభం రూ.2,932 కోట్లతో పోలిస్తే 19 శాతం పెరిగింది. ఇక ఆదాయం రూ.11,329 కోట్ల నుంచి 14 శాతం పెరిగి రూ.12,933 కోట్లకు చేరింది. పేపర్ బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్, హోటల్స్, ఎఫ్ఎంసీజీ వ్యాపారాల పనితీరు బలంగా ఉండడమే మెరుగైన ఫలితాలకు కారణం. అధిక పన్నుల కారణంగా సిగరెట్ల విభాగంపై ఒత్తిళ్లు కొనసాగినట్టు కంపెనీ తెలిపింది. సిగరెట్ల విభాగం వారీగా రూ.2,932 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆయిల్ సీడ్స్, గోధుమ, కాఫీ, అగ్రి వ్యాపారాల్లో స్థూల ఆదాయం అధికంగా నమోదైనట్టు కంపెనీ తెలిపింది. అలాగే, పేపర్ బోర్డ్స్ విభాగంలో అధిక అమ్మకాల ఆదాయం, హోటల్స్ వ్యాపారంలో రూమ్ వారీగా ఆదాయంలోనూ మెరుగుదల ఉందని కంపెనీ పేర్కొంది. వీటికితోడు ఎఫ్ఎంసీజీ ఇతర విభాగాల ఉత్పత్తుల సమతుల్యత కారణంగా ఎబిట్డా 31 శాతం పెరిగి రూ.228 కోట్లకు చేరినట్టు తెలిపింది.
రాణించిన అన్ని విభాగాలు...
సిగరెట్లు సహా మొత్తం ఎఫ్ఎంసీజీ ఆదాయం మార్చి త్రైమాసికంలో రూ.8,759 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.7,988 కోట్లు కావడం గమనార్హం. సిగరెట్ల విభాగం ద్వారా ఆదాయం రూ.4,936 కోట్ల నుంచి రూ.5,486 కోట్లకు వృద్ధి చెందింది. ఎఫ్ఎంసీజీలో ఇతర విభాగాల ఆదాయం రూ.3,051 కోట్ల నుంచి రూ.3,274 కోట్లకు పెరిగింది. ఎఫ్ఎంసీజీ కాకుండా ఇతర విభాగాల ద్వారా (పేపర్, హోటళ్లు తదితర) ఆదాయం రూ.3,517 కోట్ల నుంచి 4,148 కోట్లకు వృద్ధి చెందింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఐటీసీ రూ.52,035 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.12,824 కోట్ల లాభాన్ని గడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.11,485 కోట్లు, ఆదాయం రూ.49,520 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.5.75 డివిడెండ్‌గా ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫారసు చేసింది.
You may be interested
పల్లెలు... రెడీ టు ఈట్!!
Tuesday 14th May 2019సమయం ఆదా, సౌకర్యం కూడా పల్లెవాసుల నుంచి వీటికి ఆదరణ జోరుగా పెరుగుతున్న అమ్మకాలు దీంతో కంపెనీల ప్రత్యేక ప్రణాళికలు తక్కువ ధరలతో ఉత్పత్తుల విడుదల న్యూఢిల్లీ: కోరుకున్న వెంటనే, అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఆహారాన్ని సిద్ధం చేసుకునే అవకాశం కల్పించేవి రెడీ టు ఈట్ ఉత్పత్తులు. అంత సమయం కూడా లేదనుకుంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉండనే ఉన్నాయి. ఇప్పటిదాకా పట్టణాల్లోని మధ్య తరగతి వినియోగదారులే లక్ష్యంగా కంపెనీలు ఈ ఉత్పత్తులను గురిపెట్టేవి. అయితే, ఈ మధ్య
హెచ్డీఎఫ్సీ లాభం 27 శాతం అప్
Tuesday 14th May 2019మార్చి త్రైమాసికానికి హెచ్డీఎఫ్సీ నికరలాభం 27 శాతం పెరిగి రూ. 2861.6 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 2256.68 కోట్ల లాభం నమోదు చేసింది. సమీక్షా కాలంలో కంపెనీ రెవెన్యూ రూ. 11586 కోట్లను చేరింది. కంపెనీ కొత్త అకౌంటింగ్ ప్రమాణాలకు మారినందున ఈ ఫలితాలను గత ఫలితాలతో పోల్చలేము. కంపెనీ స్థూల ఎన్పీఏలు 1.22 శాతం నుంచి 1.18 శాతానికి దిగివచ్చాయి. క్యు4లో కంపెనీ