News


ఐటీసీ లాభం రూ.4,048 కోట్లు

Saturday 1st February 2020
news_main1580527807.png-31387

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం ఐటీసీకి ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో రూ.4,048 కోట్ల నికర లాభం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం (రూ.3,137 కోట్లు)తో పోల్చితే 29 శాతం వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది. నికర అమ్మకాలు రూ.12,506 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.13,220 కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.8,341 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ.8,779 కోట్లకు పెరిగాయని వివరించింది. 



You may be interested

బడ్జెట్‌ రోజున నష్టాలతో ప్రారంభం

Saturday 1st February 2020

బడ్జెట్‌ సందర్భంగా ఇన్వెస్టర్ల అప్రమత్తత 11900 దిగువున ప్రారంభం 50 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ బడ్జెట్‌ రోజున జరిగే ప్రత్యేక ట్రేడింగ్‌ సందర్భంగా శనివారం దేశీయ మార్కెట్‌ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 50 పాయింట్లు నష్టంతో 40673.49 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లను కోల్పోయి 11,939.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేడు స్టాక్‌ మార్కెట్‌కు సెలవుదినం అయినప్పటికీ కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండంతో స్టాక్‌ ఎక్చ్సేంజీలు పని చేస్తున్నాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలు పూనుకున్నారు. అంతర్జాతీయంగానూ

మౌలిక రంగం కొంచెం రికవరీ...

Saturday 1st February 2020

డిసెంబర్‌లో 1.3 శాతం వృద్ధి న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్‌ డిసెంబర్‌ నెలలో కొంచెం రికవరీ అయ్యింది. 1.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అంతక్రితం నాలుగు నెలల్లో గ్రూప్‌లో అసలు వృద్ధి నమోదుకాకపోగా, క్షీణ ఫలితాలు నమోదయ్యాయి. తాజా సమీక్షా నెల డిసెంబర్‌లో బొగ్గు, ఎరువులు, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తి మెరుగుపడ్డం మొత్తం ఫలితంపై కొంత సానుకూల ప్రభావం చూపింది. స్టీల్‌, సిమెంట్‌ రంగాలు కూడా సానుకూలతలోనే ఉన్నాయి.

Most from this category