STOCKS

News


ఐటీసీ సిగరెట్ల ధరలు పెంచాల్సిందే!

Monday 3rd February 2020
news_main1580708128.png-31463

తప్పదంటున్న బ్రోకరేజ్‌లు
బడ్జెట్లో సిగరెట్లపై అధిక లెవీలను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడం ఐటీసీ షేరుపై  నెగిటివ్‌ ప్రభావం చూపింది. శనివారం ఒక్కమారుగా ఐటీసీ షేరు దాదాపు 10 శాతం వరకు పడిపోయి కీలక 220 రూపాయిల దిగువకు వచ్చింది. ఈ ప్రభావం సోమవారం కూడా కొనసాగి షేరు మరో 5 శాతం వరకు పతనమై రూ.205 కనిష్ఠాలను తాకింది. ఐటీసీ లాభాల్లో సిగిరెట్‌ వ్యాపారం కీలకమైనది, దేశీయంగా అమ్ముడయ్యే చట్టబద్ధమైన సిగరెట్లలో నాలుగింట మూడొంతుల వంతు ఐటీసీ ఉత్పత్తులే ఉంటాయి. డిసెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ సిగరెట్‌ వ్యాపారంలో దాదాపు 5 శాతం వృద్ధి నమోదయింది. ఈ నేపథ్యంలో షేరుపై బ్రోకరేజ్‌లు అంచనాలు తగ్గించుకున్నాయి. సిగరెట్ల ధరలు పెంచితేనే కంపెనీ తాజా పన్ను పోటును సమతూకం చేసుకోగలదని అభిప్రాయపడుతున్నాయి. 

= తాజా పన్ను భారం తగ్గించుకోవాలంటే ఐటీసీ తన సిగిరెట్ల ధరలను 10- 15 శాతం వరకు పెంచుకోవాలని క్రెడిట్‌ సూసీ పేర్కొంది. ఈ మేరకు ధరలు పెంచినా సిగిరెట్‌ ఇబిటా వచ్చే ఆర్థిక సంవత్సరమంతా ఫ్లాట్‌గానే ఉండొచ్చని తెలిపింది. 
= బడ్జెట్‌ అనంతరం ఐటీసీపై డౌన్‌గ్రేడ్‌ ధృక్పధాన్ని ఫిలిప్‌ క్యాపిటల్‌, ఎడెల్‌వీజ్‌ వెలుబుచ్చాయి. తాజా పరిస్థితుల్లో ఐటీసీ 6-7 శాతం మేర తన సిగిరెట్ల ధరలు పెంచవచ్చని అంచనా వేశాయి. తాజా పన్ను పెంపు, వీఎస్‌టీ తదితర కంపెనీల నుంచి పోటీ కారణంగా కంపెనీ సిగిరెట్‌ వాల్యూం వృద్ధి దెబ్బతినవచ్చని అభిప్రాయపడ్డాయి. 
= ఐటీసీ షేరును ఎడెల్‌వీజ్‌ కొనొచ్చు నుంచి హోల్డ్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసి టార్గెట్‌ను రూ. 250కి తగ్గించింది. ఫిలిప్‌ క్యాపిటల్‌ సంస్థ ఐటీసీ రేటింగ్‌ను న్యూట్రల్‌కు టార్గెట్‌ను రూ.215కు తగ్గించింది. 


ITC

You may be interested

1.50శాతం లాభపడ్డ ఎఫ్‌ఎంజీసీ ఇండెక్స్‌: ఐటీసీ డౌన్‌, హెచ్‌యూఎల్‌ అప్‌

Monday 3rd February 2020

ఎఫ్‌ఎమ్‌సీజీ రంగానికి చెందిన ఐటీసీ, హెచ్‌యూఎల్‌ షేర్లు సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఒకటి నష్టాల్లోనూ, మరోటి లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌) షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, ఐటీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనవుతున్నాయి. పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై ఎన్‌సీసీడీ పన్ను పెంపుతో ఐటీసీ షేర్లు చివరి రెండు ట్రేడింగ్‌ సెషన్లో ఏకంగా 9.50శాతం నష్టాన్ని చవిచూశాయి. ఏడాదిన్నర కాలంలో రెండు ట్రేడింగ్‌ సెషన్‌లో అత్యధిక నష్టాన్ని చవిచూశాయి.

నేటి వార్తల్లోని షేర్లు

Monday 3rd February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం షేర్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, అఫ్లే ఇండియా: జీఎస్‌కే ఫార్మా, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, అఫ్లే ఇండియా, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, హడ్కో, ఎంఆర్‌పీఎల్‌, షాల్బీ, ఎస్‌ఆర్‌ఎఫ్‌, టాటా కెమికల్స్‌ మొదలైన కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలను ఈ రోజు ప్రకటించనున్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌: పారిశ్రామిక వర్గాలు వెల్లడించిన వివరాలకు మేరకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ ఒడిషాలోని నారాయణ్‌ పోషి కంపెనీకి సంబంధించిన 980

Most from this category