News


కోల్‌ ఇండియా, ఐటీసీకి జీఎస్‌టీ ముప్పు?!

Tuesday 15th October 2019
news_main1571115969.png-28890

క్రమంగా తగ్గుతూ వస్తున్న జీఎస్‌టీ వసూళ్లు అంతిమంగా ఐటీసీపై నెగిటివ్‌ ప్రభావం చూపుతాయా? అవునంటున్నారు నిపుణులు. జీఎస్‌టీ వసూళ్లలో తరుగుదల పూడ్చుకునేందుకు ప్రభుత్వం పొగాకుపై పన్ను పెంచుతుందని ఎక్కువమంది నిపుణులు బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో ఐటీసీపై నెగిటివ్‌ ప్రభావం ఉంటుందంటున్నారు. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తాజాగా ఐటీసీపై రేటింగ్‌ను ‘కొనొచ్చు’ నుంచి ‘న్యూట్రల్‌’కు తగ్గించింది. పొగాకుతో పాటు బొగ్గుపై కూడా అదనపు సెస్సు విధించే ఛాన్సులున్నాయని అంచనా వేసింది. ఇదే జరిగితే కోల్‌ ఇండియాకు నెగిటివ్‌ అని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌- ఆగస్టు కాలంలో జీఎస్‌టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగాయి. ప్రభుత్వం ఈ వసూళ్లలో 20 శాతం పెరుగుదల ఉంటుందని బడ్జెట్లో అంచనాలు వేసుకుంది. అయితే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు పెద్దగా మెరుగుపడలేదని, మరోవైపు విత్తలోటు టార్గెట్లు రాష్ట్రాలపై ఒత్తిడి పెంచుతున్నాయని తెలిపింది. రాష్ట్రాలకు ఆర్‌బీఐ, పీఎస్‌యూ డివిడెండ్లు, పెట్టుబడుల ఉపసంహరణ లాంటి నిధుల సాయం ఉండదని, అందువల్ల  రాష్ట్రాలు మూలధన వ్యయాల్లో కోతలు విధించుకుంటున్నాయని సీఎల్‌ఎస్‌ఏ విశ్లేషించింది. 

రాష్ట్రాలకు 14 శాతం జీఎస్‌టీ రెవెన్యూ వృద్ధిని కేంద్రం చూపాల్సిఉన్నందున, లోటు పూడ్చుకునేందుకు సిన్‌గూడ్స్‌పై సెస్సు విధించే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఏడాది జీఎస్‌టీ వసూళ్లలో తరుగుదల రూ. 8000 కోట్లకు పరిమితమైనా, వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ లోటు రెట్టింపు లేదా మూడు రెట్లు కావచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేసింది. ప్రస్తుత వసూళ్ల ప్రకారం చూస్తే కేంద్రం రాష్ట్రాలకు జీఎస్‌టీ తరుగుదల కింద దాదాపు రూ.1.06 లక్షల కోట్ల సాయం అందించాల్సిరావచ్చని హెచ్చరించింది. ఇవన్నీ కలిసి ప్రభుత్వం అదనపు ఆదాయ మార్గాల అన్వేషణ చేయాల్సిన అవసరం కల్పిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.  ఇందులో భాగంగానే పొగాకు ఉత్పత్తులు, బొగ్గుపై పన్నులు పెంచవచ్చని సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది. 2020-21లో జీఎస్‌టీ వృద్ధి 17 శాతం చేరితే అప్పుడు పన్ను పెరుగుదల ఉండకపోవచ్చని తెలిపింది. రాష్ట్రాల ఆదాయాలు తగ్గడం అంతిమంగా ఐటీసీపై ప్రభావం చూపవచ్చని, రెండుళ్లుగా పన్నుల పెంపులేని ఐటీసీపై భారం పడవచ్చని తెలిపింది. అందుకే షేరు రేటింగ్‌ను తగ్గించామని వివరించింది. 


ITC

You may be interested

ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ 7% క్రాష్‌

Tuesday 15th October 2019

 ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, షేర్ల బై బ్యాక్‌ చేయాలని ఆలోచిస్తున్నప్పటికి ఈ కంపెనీ షేరు మాత్రం గత కొన్ని సెషన్‌ల నుంచి నష్టాల్లో ట్రేడవుతోంది. అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ సంస్థ మూడీస్‌ ఈ కంపెనీ రేటింగ్‌ను బీఏ2 నుంచి బీ2 తగ్గించి, ఈ కంపెనీపై ప్రతికూల దృక్ఫథాన్ని కలిగి ఉండడంతో ఈ కంపెనీ షేరు గత సెషన్‌లో(అక్టోబర్‌ 14) 6 శాతానికి పైగా నష్టపోయింది. కాగా మంగళవారం సెషన్‌

విరాళాల్లో హెచ్‌సీఎల్‌ నాడార్ టాప్‌..

Tuesday 15th October 2019

ముకేశ్ అంబానీ మూడో స్థానంలో  ఎడెల్‌గివ్ హురూన్ ఇండియా జాబితాలో వెల్లడి ముంబై: సామాజిక సేవా కార్యక్రమాల కోసం అత్యధికంగా విరాళమిచ్చిన దేశీ దిగ్గజాల్లో టెక్నాలజీ సంస్థ హెచ్‌సీఎల్‌ అధిపతి శివ్‌ నాడార్ అగ్రస్థానంలో నిల్చారు. మరో టెక్‌ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ రెండో స్థానంలో ఉండగా.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మాత్రం మూడో స్థానంలో నిల్చారు. ఎడెల్‌గివ్ హురూన్ ఇండియా ఫిలాంత్రోపీ

Most from this category