STOCKS

News


రిలయన్స్‌ జియోకు అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌లో విజయం

Thursday 26th December 2019
news_main1577329124.png-30438

  • టవర్ల డీమెర్జర్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తన ఆప్టికల్‌ ఫైబర్‌, టవర్‌ వ్యాపారాలను వేరు చేయడాన్ని (డీమెర్జర్‌) వ్యతిరేకిస్తూ ఆదాయపన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రి‍బ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) కొట్టివేసింది. జియో డిజిటల్‌ ఫైబర్‌ ప్రైవేటు లిమిటెడ్‌, రిలయన్స్‌ జియో ఇన్ఫ్రాటెల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తన ఫైబర్‌, టవర్‌ వ్యాపారాలను వేరు చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ అహ్మదాబాద్‌ బెంచ్‌ అనుమతి మంజూరు చేసింది. దీనిపై ఆదాయపన్ను శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘డీమెర్జర్‌ స్కీమ్‌ ప్రకారం రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ రెడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లను రుణాలుగా మార్చాల్సి ఉంటుంది. ఈక్విటీని డెట్‌గా మార్చడం అన్నది కంపెనీ లా సూత్రాలకు వ్యతిరేకం. అంతేకాదు బదిలీ కంపెనీ (జియోఇన్ఫోకామ్‌) లాభదాయక లేదా నికర ఆదాయం తగ్గిపోతుంది. ఇది ఆదాయపన్ను విభాగానికి ఆదాయ నష్టాన్ని కలిగిస్తుంది’’ అని ఆదాయపన్ను శాఖ వాదించింది. 



You may be interested

సౌర విద్యుత్‌పై ఎన్టీపీసీ దృష్టి

Thursday 26th December 2019

రూ. 50,000 కోట్ల పెట్టుబడి 2022 నాటికి 10 గి.వా. సామర్థ్యం పెంపు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ 2022 నాటికి మరో 10 గిగావాట్ల మేర సౌర విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని యోచిస్తోంది. దీనికోసం రూ. 50,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. గ్రీన్ బాండ్స్ ద్వారా ఇందుకు కావాల్సిన నిధులను సమకూర్చుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సౌర విద్యుత్ సహా ఎన్‌టీపీసీ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 920

‍స్వతంత్ర డైరెర్టర్లు... గుడ్‌బై..!

Thursday 26th December 2019

పెరుగుతున్న రాజీనామాల సంఖ్య ఈ పదవులకు పలువురు ప్రముఖుల దూరం  కంపెనీల్లో వెలుగుచూస్తున్న స్కామ్‌లతో పరువు, ప్రతిష్ఠలు పోతాయని భయం  ప్రమోటర్ల నిర్ణయాలకు బలవుతామనే సంశయం ఎన్‌ఎస్‌ఈ ఇన్ఫోబేస్‌ డాట్‌కామ్‌ వెల్లడి దేశీ కార్పొరేట్‌ రంగంలో తాజాగా వెలుగుచూస్తున్న కుంభకోణాలు, అవకతవకలు... బోర్డు రూమ్ సంక్షోభానికి దారితీస్తోంది. స్కామ్‌ల పాపం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో కంపెనీల నుంచి వైదొలగుతున్న ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో

Most from this category