News


ఐటీలో మధ్యస్థాయి ఉద్యోగులకు గండం

Friday 8th November 2019
news_main1573185245.png-29431

-5-10 శాతం మేర తొలగింపు 
-ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో బాలకృష్ణన్‌ అంచనాలు

బెంగళూరు: ఐటీ రంగంలో మధ్య స్థాయి ఉద్యోగుల్లో 5 నుంచి 10 శాతం మందిని తొలగించడం మినహా కంపెనీలకు మరో ప్రత్యామ్నాయం లేదని ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో వి.బాలకృష్ణన్‌ అన్నారు. ఐటీ కంపెనీల్లో సుమారు 20-30 శాతం వరకు మధ్య ‍స్థాయి ఉద్యోగులు ఉంటుంటారు. ఐటీ కంపెనీలు మధ్య స్థాయిలో అధిక భారాన్ని మోస్తున్నాయని, దీన్ని తగ్గించుకోవడం ద్వారా మరింత చురుగ్గా మారాల్సి ఉంటుందన్నారు బాలకృష్ణన్‌. ‘‘కొత్త టెక్నాలజీను అర్థం చేసుకోగలిగిన ఉద్యోగులను కంపెనీలు తీసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్‌ హవా నడుస్తోంది. దీనితోపాటు కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా కంపెనీలు సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో డిజిటల్‌, నూతన టెక్నాలజీలకు సంబంధించి ప్రతిభావంతులను ఆకర్షించాల్సి ఉంటుంది. అదే సమయంలో పాత టెక్నాలజీలకు సంబంధించి పనిచేస్తున్న వారిని తొలగించాల్సి ఉంటుంది’’ అని బాలకృష్ణన్‌ ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఇప్పటికే ఐటీ రంగంలో ప్రముఖ కంపెనీలు కాగ్నిజంట్‌, ఇన్ఫోసిస్‌ ఉద్యోగుల తొలగింపుపై నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మిగిలిన కంపెనీలకు కూడా ఈ బాటలో వెళతాయా? అన్న పశ్నకు మరో మార్గం లేదని, మార్జిన్లపై అవి ఎంతో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. 2019 సంవత్సరంలో దేశ ఐటీ కంపెనీల వృద్ధి నిలకడానే ఉందన్నారు. 2020లోనూ స్థిరంగానే ఉండొచ్చని, ఆర్థిక వ్యవస్థలు నిలకడానే ఉన్నాయని, మందగమనం భయాలేమీ లేవన్నారు. 

కాగ్నిజంట్‌లో భారీ నియామకాలు
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ 2020లో 23,000 మంది విద్యార్థులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. దేశంలోని సాంకేతిక సంస్థల నుండి ఎస్‌టీఈఎం గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు వెల్లడించింది. 



You may be interested

ఆర్థిక రంగ పరిస్థితులపై మంత్రి సీతారామన్‌ సమీక్ష

Friday 8th November 2019

ఆర్‌బీఐ గవర్నర్‌ సహా ప్రముఖుల హాజరు న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగ పరిస్థితి, ఈ రంగంలో ఉన్న ఒత్తిళ్లు తదితర అంశాలపై ‘ఆర్థిక రంగ స్థిరత్వం, అభివృద్ధి కౌన్సిల్‌’ (ఎఫ్‌ఎస్‌డీసీ) 21వ సమావేశంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమీక్ష చేశారు. గురువారం ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ తదితర కీలక ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎఫ్‌ఎస్‌డీసీ అనేది ఆర్థిక

 నష్టాలతో ప్రారంభం

Friday 8th November 2019

 భారత్‌ స్టాక్‌ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 103 పాయింట్ల నష్టంతో 40,550 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 12,000 పాయింట్ల దిగువన 11,978 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. 

Most from this category