News


జనాభా 130 కోట్లు .. పన్ను కట్టింది1.46 కోట్లు

Saturday 15th February 2020
news_main1581736386.png-31807

 • కానీ ఏటా విదేశాలకు వెళుతున్న 3 కోట్ల మంది
 • రూ.5 కోట్ల ఆదాయం దాటింది 8,600 మందే
 • వారిలో రూ.కోటి దాటిన ప్రొఫెషనల్స్‌ 2,200
 • మొత్తం రిటర్న్లు వేసిన వారి సంఖ్య 5.78 కోట్లు
 • 2018-19 ఆదాయ పన్ను రిటర్నుల్లో ఎన్నెన్ని చిత్రాలో...

సాక్షి, అమరావతి: గడిచిన ఐదేళ్లలో దేశంలో 1.5 కోట్ల ఖరీదైన కార్లు అమ్ముడుపోయాయి. రూ.కోటికి తక్కువ కాని ఫ్లాట్లు లక్షల సంఖ్యలో అమ్ముడుపోయాయి. ఇదే సమయంలో మూడు కోట్ల మందికిపైగా పర్యాటకం, వ్యాపారాల పేరుతో విదేశాలను చుట్టివచ్చారు. కానీ మన దేశంలో ఆదాయం పన్ను కడుతున్న వారెంతమందో తెలుసా? 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.46 కోట్ల మంది ఆదాయ పన్ను కట్టినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ ప్రకటించింది. 130 కోట్లకు పైగా జనభా ఉన్న దేశంలో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసింది 5.78 కోట్ల మందే. అంతేకాదు లాయర్లు, డాక్టర్లు, చార్టర్డ్‌ అకౌంటెట్లు వంటి వృత్తినిపుణులు పెద్ద సంఖ్యలో ఉన్నా... వీరిలో సంవత్సరానికి రూ.కోటి ఆదాయం దాటిన వారు మాత్రం 2,200 మందే!!. నిజానికి ఈ సమాచారం చూసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే ముక్కున వేలేసుకున్నారు!!. దీనిపై ఆయన ఘాటుగానే స్పందించారు. కోటి రూపాయల ఆదాయం దాటిన వృత్తినిపుణుల సంఖ్య కేవలం 2,200 ఉందంటే నమ్మశక్యంగా లేదన్నారు. ఈ గణాంకాలు ఎంత మంది పన్ను చెల్లించకుండా ఎగ్గొడుతున్నారన్నది స్పష్టం చేస్తున్నాయని, దేశాభివృద్ధికి అందరూ పన్నులు చెల్లించాలని కోరారాయన. నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్న వారిపై ఈ భారం పడుతోందన్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ వెల్లడించిన మరిన్ని వివరాలు ఇవీ...
 

 • 5 కోట్ల ఆదాయం దాటిన వారు - 8,600
 • 50 లక్షల ఆదాయం దాటినవారు - 3,16,000
 • 10 లక్షల పైన ఆదాయం చూపిన వారు- 46 లక్షలు
 • 5-10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు- కోటి మంది
 • 2.50 లక్షలు- 5 లక్షలు మధ్య ఉన్న వారు - 3.29 కోట్లు
 • 2.50 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారు- 1.03 కోట్లు
 • మొత్తం రిటర్నులు దాఖలు చేసిన వారు - 5.78 కోట్లు
 • రూ.5 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు కనక 4.32 కోట్ల మంది ఎలాంటి పన్నూ కట్టలేదు
 • నికరంగా పన్ను చెల్లించిన వారు - 1.46 కోట్లు... దాదాపుగా 1 శాతం. 

(ఆదాయం రూ.కోట్లలో)You may be interested

ఉల్లి, ఆలూ ధరలు ప్రియం

Saturday 15th February 2020

టోకు ధరల సూచీపై ఆహార ధరల ఎఫెక్ట్‌ జనవరిలో డబ్ల్యూపీఐ 3.1 శాతం మందగమనాన్ని సూచిస్తున్న తయారీ పెరుగుదల కేవలం 0.34 శాతం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరి గణాంకాలు ఒకవైపు ఆహార ధరల తీవ్రతను, మరోవైపు కీలక తయారీ రంగంలో మందగమనాన్ని సూచించాయి. 2020 జనవరిలో సూచీ రేటు మొత్తంగా 3.1 శాతంగా నమోదయితే, ఒక్క తయారీ రంగంలో ధరల పెరుగుదల రేటు 0.34 శాతంగా ఉంది. కాగా

టెల్కోలపై సుప్రీం కన్నెర!

Saturday 15th February 2020

(అప్‌డేటెడ్‌...) ధిక్కరణ చర్యలుంటాయని కంపెనీ అధిపతులకు హెచ్చరిక టెల్కోల అధినేతలకు సుప్రీం కోర్టు హెచ్చరిక ఏజీఆర్‌ బాకీల ఉత్తర్వుల ఉల్లంఘనపై సీరియస్‌ టెలికం శాఖ అధికారి తీరుపై ఆగ్రహం; నోటీసు సుప్రీంకోర్టును మూసేద్దామా.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు మార్చి 17లోగా బకాయిలు కట్టేయాలని స్పష్టీకరణ కట్టకపోతే అంతా కోర్టుకు రావాల్సిందేనని ఆదేశాలు న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బకాయీల షెడ్యూల్‌పై ఊరట లభిస్తుందని ఆశిస్తున్న టెలికం సంస్థలకు శుక్రవారం షాకుల మీద షాకులు తగిలాయి. బాకీలు కట్టేందుకు మరికాస్త వ్యవధి లభించేలా గతంలో ఇచ్చిన

Most from this category