News


బ్లాక్‌మనీ ఉన్నట్లు సిద్దార్థ అంగీకరించారు: ఐటీ శాఖ

Wednesday 31st July 2019
news_main1564545661.png-27426

అదృశ్యమైన కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్దార్థను తాము గతంలో దర్యాప్తు సందర్భంగా వేధించామన్న ఆరోపణలను ఆదాయపు పన్ను శాఖ ఖండించింది. సోషల్‌ మీడియాలో వెలుగుచూసిన లేఖలోని సిద్దార్థ సంతకం, తమ దగ్గరున్న సంతకానికి చాలా తేడా ఉందని ఐటీ శాఖ వర్గాలు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. గతంలో తాము జరిపిన సోదాల్లో తనవద్ద బ్లాక్‌మనీ ఉన్నట్లు సిద్దార్థ అంగీకరించారని కూడా ఐటీ శాఖ తెలిపింది. భారీ మొత్తంలో పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు తగిన ఆధారాలు దొరకడంతోనే షేర్లను అటాచ్‌ చేశామని, 2017లో కాఫీ డే గూపు కంపెనీల్లో సోదాలను కూడా చేశామని ఐటీ అధికారులు చెప్పారు. ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారమే తాము చర్యలు తీసుకున్నామని కూడా స్పష్టం చేశారు. కాగా, మైండ్‌ ట్రీ షేర్ల విక్రయం ద్వారా సిద్దార్థకు దాదాపు రూ.3,200 కోట్లు వచ్చాయని.. ఈ డీల్‌ విషయంలో కనీస ప్రత్యామ్నాయ పన్నుగా రూ.300 కోట్లను సిద్దార్థ చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.46 కోట్లను మాత్రమే కట్టారని కూడా ఐటీ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ వద్ద రూ.362.11 కోట్ల లెక్కలో చూపని ఆదాయం(బ్లాక్‌ మనీ) తో పాటు, తన వద్ద రూ.118.02 కోట్ల నగదు ఉన్నట్లు సిద్దార్థ ఒప్పకున్నారని ఐటీ వర్గాలు వివరించాయి.You may be interested

బకాయిలేమీ లేవు: హెచ్‌డీఎఫ్‌సీ

Wednesday 31st July 2019

సిద్దార్థతో సంబంధం ఉన్న కంపెనీల నుంచి తమకు రుణ బాకాయిలు ఉన్నట్లు వచ్చిన వార్తలను హెచ్‌డీఎఫ్‌సీ తోసిపుచ్చింది. ‘సీసీడీకి చెందిన టాంగ్లిన్‌ డెవలప్‌మెంట్స్‌ బెంగళూరులోని గ్లోబల్‌ విలేజ్‌ టెక్‌పార్క్‌ ప్రాజెక్టు కోసం గతంలో మేం రుణాలిచ్చాం. అయితే, 2019 జనవరిలో ఈ మొత్తం రుణాన్ని సంబంధిత సంస్థ చెల్లించేసింది. ప్రస్తుతం కాఫీడే ఎంటర్‌ ప్రైజెస్‌ గ్రూపు నుంచి మాకు ఎలాంటి బకాయిలూ లేవు’ అని హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధి ఒకరు స్పష్టం

దేశీ కాఫీ కింగ్‌ సిద్ధార్థ ..

Wednesday 31st July 2019

దాదాపు 140 ఏళ్లుగా కాఫీ వ్యాపారంలో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సిద్ధార్థ జీవితంలో పలు మలుపులు ఉన్నాయి. ఆయన ముందుగా భారతీయ ఆర్మీలో చేరాలనుకున్నారు. కానీ ఎకనమిక్స్‌లో మాస్టర్స్ పట్టా తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకరుగా మారారు. 1984లో సొంతంగా శివన్‌ సెక్యూరిటీస్ పేరిట ఇన్వెస్ట్‌మెంట్‌, వెంచర్ క్యాపిటల్ సంస్థను ప్రారంభించారు. దాన్నుంచి వచ్చిన లాభాలతో కర్ణాటకలోని చిక్‌మగళూర్‌ జిల్లాలో కాఫీ తోటలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అదే

Most from this category