STOCKS

News


ఇసుజు కార్ల పరిశ్రమలో అదనపు ఉత్పత్తులు ప్రారంభం

Tuesday 11th February 2020
news_main1581391623.png-31675

  • రూ. 400కోట్లతో ప్రెస్‌షాప్, ఇంజన్‌ అసెంబ్లీ యూనిట్లు ఏర్పాటు

వరదయ్యపాళెం(చిత్తూరు జిల్లా): శ్రీసిటీలోని జపనీస్‌ యుటిలిటీ వాహన తయారీదారు ఇసుజు మోటార్స్‌ ఇండియా పరిశ్రమలో అదనపు ఉత్పత్తుల యూనిట్‌ను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. కంపెనీ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ కొజిరో యఖియామా, ఇసుజు మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ టోరూ నకాటా, మిట్సుబిషి కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్, సీఈఓ ఇవారో టోయిడి శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని రూ. 400కోట్ల పెట్టుబడులతో అదనపు ఉత్పత్తి కేంద్రంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌షాప్‌ సదుపాయం, ఇంజన్‌ అసెంబ్లీ యూనిట్లను ప్రారంభించారు. ఈ రెండవ దశ కార్యకలాపాల ప్రారంభం భారత్‌లోని ఇసుజు ప్రయాణంలో అతి ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ తెలిపారు. అంతర్జాతీయ తయారీ కేంద్రాలలో ఒకటిగా ఈ ప్లాంటును తీర్చిదిద్దడానికి ఇసుజు చేస్తున్న ప్రయత్నాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. అనివార్య పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయిన రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పంపిన అభినందన సందేశాన్ని  శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి  చదివి వినిపించారు. మంత్రి తన సందేశంలో ఇసుజుకు అన్నివిధాలా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు, భరోసా ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఆటో మొబైల్‌ తయారీకి ఇసుజు ఒక ప్రామాణికంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి కార్ల పరిశ్రమ ఇసుజు అంటూ శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. టోరూ నకాటా మాట్లాడుతూ.. పోటీ మార్కెట్‌లో అత్యుత్తమ శ్రేణి ఉత్పత్తులు, సేవలను అందించడానికి ఇసుజు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తుల నాణ్యత, విశ్వసనీయతకు భరోసా అందిస్తామన్నారు. రెండవ దశ కార్యకలాపాలు తమ వృద్ధిని మరింత వేగవంతం చేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌ సామర్థ్యాన్ని విస్తరించనుందని ఆయన పేర్కొన్నారు. You may be interested

యూనియన్‌ బ్యాంకు ఆకర్షణీయ ఫలితాలు

Tuesday 11th February 2020

నాలుగు రెట్లు పెరిగిన నికర లాభం రూ.575 కోట్లుగా నమోదు న్యూఢిల్లీ: యూనియన్‌ బ్యాంకు డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల్లో మంచి పనితీరు ప్రదర్శించింది. బ్యాంకు స్టాండలోన్‌ లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.153 కోట్లతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగి రూ.575 కోట్లకు చేరుకుంది. బ్యాంకు ఆదాయం కూడా రూ.9,573 కోట్ల నుంచి రూ.10,741 కోట్లకు దూసుకుపోయింది. బ్యాంకు ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)

నేడు గ్యాపప్‌ ఓపెనింగ్‌?!

Tuesday 11th February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 51 పాయింట్లు ప్లస్‌ సోమవారం యూఎస్‌ మార్కెట్ల రికార్డ్స్‌ నేడు(మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల(గ్యాపప్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 51 పాయింట్లు ఎగసి 12,100 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,049 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ ఆందోళనల నుంచి

Most from this category