News


మరిన్ని మెట్రో నగరాలకు ఐస్ప్రౌట్‌

Saturday 2nd November 2019
news_main1572668305.png-29302

  • 2020లో అదనంగా ఆరు కేంద్రాలు
  • తోడవనున్న 5,000 సీట్ల సామర్థ్యం
  • సాక్షితో ఐస్ప్రౌట్‌ సీఈవో సుందరి పాటిబండ్ల

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- కార్యాలయం ఏర్పాటు పెట్టుబడితో కూడుకున్నది. అందుకే అన్ని సౌకర్యాలు, వసతులతో వినియోగానికి సిద్ధంగా ఉన్న కో-వర్కింగ్‌ స్పేస్‌ కల్చర్‌ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు ఇప్పుడు ఈ కేంద్రాలే అడ్డా అని అంటున్నారు ఐస్ప్రౌట్‌ సీఈవో, కో-ఫౌండర్‌ సుందరి పాటిబండ్ల. కంపెనీ ఆరవ సెంటర్‌ను హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో శుక్రవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఐస్ప్రౌట్‌ విస్తరణ, ఈ రంగంలో ఉన్న వ్యాపార అవకాశాల గురించి ఆమె సాక్షి బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లో..
ఆరేళ్ల క్రితం వచ్చిన ఆలోచన..
ఎస్‌పీసీ అండ్‌ అసోసియేట్స్‌లో చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాను. కొత్తగా కంపెనీని ఏర్పాటు చేసేందుకు మా వద్దకు వచ్చే ఇతర ప్రాంతాల వారికి వసతి కల్పించేవారం. కొద్ది రోజులు వారి కార్యకలాపాలు మా కార్యాలయం వేదికగా జరిగేవి. ఒక్కో దశలో ఆఫీసు నిండిపోయేది. దీంతో కో-వర్కింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని 2013లో ఆలోచన వచ్చింది. సీఏ కె.శేషా ప్రసాద్‌ కో-ఫౌండర్‌గా తొలి కేంద్రం 2017 జూన్‌లో కార్యరూపం దాల్చింది. మరో కో-ఫౌండర్‌, వొలాంటే టెక్నాలజీస్‌ ఫౌండర్‌ విజయ్‌ వద్దిరాజు తన కార్యాలయాన్ని ఐస్ప్రౌట్‌కు మార్చడం ఉత్సాహం నింపింది. మూడు నెలల్లోనే బ్రేక్‌ ఈవెన్‌కు చేరుకున్నాం. అలా రెండేళ్లలోనే ప్రీమియం కో-వర్కింగ్‌ స్పేస్‌ ప్రొవైడర్‌గా మంచి పేరు సంపాదించాం.
కొత్త నగరాలకు విస్తరణ...
హైదరాబాద్‌లో మూడు, చెన్నై, విజయవాడలో ఒక్కో కో-వర్కింగ్‌ సెంటర్లను నిర్వహిస్తున్నాం. వీటన్నిటి సామర్థ్యం 2,200 సీట్లు. నానక్‌రామ్‌గూడ కేంద్రాన్ని 80,000 చదరపు అడుగుల్లో నిర్మించాం. ఇక్కడ 1,100 మంది పనిచేయగలిగే వీలుంది. చెన్నైలో మరో ఫెసిలిటీ 1,100 సీట్లతో డిసెంబరుకల్లా సిద్ధమవుతోంది. 2020లో ఢిల్లీ రాజధాని ప్రాంతంలో రెండు, బెంగళూరులో రెండు, ముంబై, పుణేలో ఒక్కో సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాం. వీటి రాకతో 5,000 సీట్ల సామర్థ్యం తోడవుతుంది. నూతన కేంద్రాల కోసం రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికే రూ.70 కోట్లు వెచ్చించాం. ఔట్‌సోర్స్‌ సిబ్బందితో కలిపి ఉద్యోగుల సంఖ్య 130 ఉంది. ఏడాదిలో ఈ సంఖ్య 300లకు చేరనుంది.
కొత్త తరం వ్యాపారులకు...
కో-వర్కింగ్‌ స్పేస్‌ సెంటర్లు కొత్త తరం వ్యాపారులకు అడ్డాలుగా మారనున్నాయి. ఒక్క హైదరాబాద్‌లో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాలు నెలకొన్నాయి. ఇందులో 2019లో 75 శాతం స్థలం తోడైందంటే ఈ రంగం ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 70 దాకా కంపెనీలు 100 ఫెసిలిటీలను నిర్వహిస్తున్నాయి. వీటికి అదనంగా 2020లో 20-50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కో-వర్కింగ్‌ స్పేస్‌ కిందకు రానుందని అంచనా. You may be interested

97 విమానాలకు ఇంజన్లు మార్చాల్సిందే

Saturday 2nd November 2019

లేదంటే వాటిని నిలిపివేయాల్సిందే ఇండిగోకు జనవరి వరకు గడువిచ్చిన డీజీసీఏ ఇంజన్లలో తరచూ సమస్యలే కారణం న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో, తన నిర్వహణలో ఉన్న 97 ఏ320 నియో విమానాలకు ప్రస్తుత ‘ప్రట్‌ అండ్ విట్నీ’ (పీడబ్ల్యూ) ఇంజన్లను (రెండు రెక్కల్లోనూ) వచ్చే జనవరి 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చాలని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) శుక్రవారం ఆదేశించింది. లేదంటే వాటిని నిలిపివేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఇండిగో

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాభం రూ.266 కోట్లు

Saturday 2nd November 2019

32 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం  రూ.11,986 కోట్లకు చేరిన మొత్తం ఆదాయం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.266 కోట్ల నికర లాభం సాధించింది. కేటాయింపులు తగ్గడం, నికర వడ్డీ ఆదాయం బాగా ఉండటం, ఇతర ఆదాయం పెరగడంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో

Most from this category