News


ఎల్‌ఐసీ ఐపీఓకు రావడం మంచిదే !

Wednesday 19th February 2020
news_main1582081597.png-31909

  • ఈ ప్రతిపాదనేదీ ఇప్పటివరకూ రాలేదు 
  • వెల్లడించిన ఐఆర్‌డీఏఐ చైర్మన్‌ 

ముంబై: ఎల్‌ఐసీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు సంబంధించిన ప్రతిపాదన ఏదీ  ప్రస్తుతానికైతే తమ వద్దకు రాలేదని బీమా నియంత్రణ సంస్థ, ఐఆర్‌డీఏఐ తెలిపింది. పారదర్శకత, ఇతర అంశాల దృష్ట్యా చూస్తే, ఎల్‌ఐసీ ఐపీఓకు  రావడం మంచి ప్రయత్నమేనని ఐఆర్‌డీఏఐ చైర్మన్‌ ఎస్‌.సి. కుంతియా పేర్కొన్నారు. అసలు ప్రతీ బీమా కంపెనీ కూడా స్టాక్‌ మార్కెట్లో లిస్టయితే మంచిదని వివరించారు. బీమా పాలసీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపులు  వచ్చేవని, అయితే తాజా బడ్జెట్‌లో ఈ మినహాయింపులు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల బీమా సంస్థలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. కొంత కాలం ఈ మినహాయంపులు లభిస్తాయని పేర్కొన్నారు. 

నష్టాలు వచ్చే పాలసీలను పక్కనబెట్టి, లాభాలు వచ్చే పాలసీలపై బీమా కంపెనీలు దృష్టి సారించాలని కుంతియా పిలుపునిచ్చారు. దేశంలో ఆశించిన స్థాయిలో బీమా పరిశ్రమ వృద్ది సాధించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన జనాభా 130 కోట్లని, అయితే యాక్చువరీల(బీమా రంగ నిపుణుల) సంఖ్య 460 మాత్రమేనని చెప్పారు. ఈ సంఖ్యను మరింతగా పెంచేలా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చువరీస్‌ ఆఫ్‌ ఇండియా ప్రయత్నాలు చేయాలని పేర్కొన్నారు. 



You may be interested

ఫార్మాకు ‘‘కోవిడ్‌’’ ఫీవర్‌!!

Wednesday 19th February 2020

పెరగనున్న ముడివస్తువుల రేట్లు ఆందోళనలో ఔషధ రంగం తోడ్పాటు చర్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి భరోసా న్యూఢిల్లీ: చైనా సహా పలు దేశాలకు విస్తరించిన కరోనావైరస్ సెగ దేశీ ఫార్మా పరిశ్రమకు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ చైనాలో పరిస్థితులు గానీ సత్వరం చక్కబడకపోతే ఔషధాల్లో ఉపయోగించే ముడివస్తువుల రేట్లు గణనీయంగా పెరగవచ్చని ఫార్మా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. "ఇదే పరిస్థితి కొనసాగితే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ) ధరలు పెరిగిపోతాయి" అని జైడస్

హీరో మోటోకార్ప్‌ భారీ విస్తరణ ప్రణాళికలు

Wednesday 19th February 2020

వచ్చే 5-7 ఏళ్లలో రూ. 10,000 కోట్ల పెట్టుబడి న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌.. భారీ విస్తరణ ప్రణాళికలను చేపట్టనుంది. ప్రత్యామ్నాయ వాహన పరిశోధన- అభివృద్ధి, స్థిర ఉత్పాదక సౌకర్యాల ఏర్పాటు, నెట్‌వర్క్ విస్తరణ, ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్‌ను విస్తరింపచేయడం వంటి అంశాలపై తాజాగా దృష్టిసారించింది. ఇందు కోసం వచ్చే 5-7 ఏళ్లలో రూ. 10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్

Most from this category