STOCKS

News


ఐఆర్‌సీటీసీ లాభం మూడు రెట్లు అప్‌

Thursday 13th February 2020
news_main1581568597.png-31749

  • ఒక్కో షేర్‌కు రూ.10 డివిడెండ్‌ 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐఆర్‌సీటీసీ(ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో దాదాపు మూడు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) క్యూ3లో రూ.74 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 180 శాతం ఎగసి రూ.206 కోట్లకు పెరిగిందని ఐఆర్‌సీటీసీ తెలిపింది. అన్ని విభాగాలు మంచి వృద్ధి సాధించడంతో నికర లాభం ఈ రేంజ్‌లో పెరిగిందని పేర్కొంది. కార్యకలాపాల ఆదాయం 65 శాతం పెరిగి రూ.716 కోట్లకు,  నిర్వహణ లాభం 169 శాతం వృద్ధితో రూ.266 కోట్లకు పెరిగాయి.  గత క్యూ3లో 22.72 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్‌ ఈ క్యూ3లో 37.11కు చేరింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.10 డివిడెండ్‌(వంద శాతం)ను ప్రకటించింది. 



You may be interested

సెలెక్ట్‌ మొబైల్స్‌ ‘గ్రాండ్‌ వాలంటైన్స్‌ డే ఆఫర్స్‌’

Thursday 13th February 2020

హైదరాబాద్‌: ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మొబైల్‌ రిటైల్‌ కంపెనీ సెలెక్ట్‌ మొబైల్స్‌ గ్రాండ్‌ వాలంటైన్స్‌ డే ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 13, 14 తేదీల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ సీఎండీ వై గురు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోని అన్ని సెలెక్ట్‌ మొబైల్‌ షోరూమ్‌లలో ఈ ఆఫర్లు లభ్యమవుతాయని పేర్కొన్నారు. రూ.25,500 విలువ చేసే శాంసంగ్‌ ఏ6 కేవలం రూ.8,999లకు, రూ.8,999 విలువ

ఐఆర్‌సీటీసీ హైజంప్‌- నాట్కో కుదేల్‌

Thursday 13th February 2020

సరికొత్త గరిష్టానికి ఐఆర్‌సీటీసీ నాట్కో ఫార్మా 6 శాతం పతనం  క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో రైల్వే రంగ పీఎస్‌యూ ఐఆర్‌సీటీసీ లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకుంది. అయితే మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌)లో సాధించిన ఫలితాలు నిరాశపరచడంతో ఫార్మా రంగ హైదరాబాద్‌ కంపెనీ నాట్కో ఫార్మా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఐఆర్‌సీటీసీ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. నాట్కో భారీ

Most from this category