News


ఐఆర్‌సీటీసీ ఐపీఓ... అదుర్స్‌ !

Friday 4th October 2019
news_main1570160598.png-28703

112 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన ఐపీఓ 
జారీ చేసేది 2 కోట్ల షేర్లు
దరఖాస్తులు వచ్చింది 225 కోట్ల షేర్లకు 
ఈ నెల 14న స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌
రూ.150-200 రేంజ్‌లో లిస్టింగ్‌ లాభాలు 


న్యూఢిల్లీ: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ) సూపర్‌ హిట్‌ అయింది. గురువారం ముగిసిన ఈ ఐపీఓ 112 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కావడం విశేషం. మందగమనం ఉన్నప్పటికీ, కంపెనీ పై భవిష్యత్తు అంచనాలు ఆశావహంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన లభించిందని నిపుణులంటున్నారు. ఈ ఐపీఓలో భాగంగా 12.6 శాతానికి సమానమైన 2 కోట్ల షేర్లను కేంద్ర ప్రభుత్వం ఆఫర్‌ ఫర్‌  సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో విక్రయించింది. రూ.317-320 ప్రైస్‌బ్యాండ్‌తో ఈ ఐపీఓ ద్వారా కేంద్రానికి రూ.645 కోట్లు లభిస్తాయని అంచనా. ఈ నెల 14న ఈ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతాయి. ఈ ఐపీఓకు అనూహ్యమైన స్పందన లభించడంతో రూ.150-200 రేంజ్‌లో లిస్టింగ్‌ లాభాలు ఉండొచ్చని నిపుణుల అంచనా వేస్తున్నారు. 

2 కోట్ల షేర్లకు...225 కోట్ల షేర్లకు దరఖాస్తులు...
మొత్తం 2 కోట్ల షేర్లకు గాను 225 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల(క్విబ్‌)కు కేటాయించిన వాటా 109 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల వాటా 355 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా 14.65 రెట్లు చొప్పున ఓవర్‌ సబ్‌స్క్రైబయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కాబోతున్న రెండో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో అత్యంత విజయవంతమైన ఐపీఓ ఇదే. క్విబ్‌, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల, ఉద్యోగుల వాటాల విషయంలో అత్యధిక బిడ్‌లు వచ్చాయి. 

ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా యెస్‌ సెక్యూరిటీస్‌(ఇండియా), ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌, ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ వ్యవహరిస్తున్నాయి. రైల్వేలకు కేటరింగ్‌ సర్వీసులు అందించే ఏకైక కంపెనీ.. ఐఆర్‌సీటీసీయే. ఆన్‌లైన్‌ రైల్వే టికెట్లు, ప్యాకేజ్‌డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ను ఈ కంపెనీ విక్రయిస్తోంది. You may be interested

టాటా ‘పులి’ స్వారీ ముగుస్తుందా?

Friday 4th October 2019

జేఎల్‌ఆర్‌ కొనుగోలు రేసులో బీఎండబ్లూ‍్య! టాటా మోటార్స్‌కు ఇది మంచి అవకాశం... బీఎండబ్ల్యూ విస్తరణకు అవకాశాలు పరిమితమే... జేఎల్‌ఆర్‌ రూపంలో మంచి విలువ సృష్టించొచ్చు జేఎల్‌ఆర్‌ విలువ రూ.82 వేల కోట్లుగా అంచనా... బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టీన్‌ నివేదిక కష్టకాలంలో టాటాలను కామధేనువుగా ఆదుకున్న జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్‌)... ఇప్పుడు నష్టాలతో ఎదురీదుతోంది. బ్రెగ్జిట్‌ గండానికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్‌ మందగమనం... జేఎల్‌ఆర్‌ అమ్మకాలకు గండికొడుతోంది. దీంతో మాతృసంస్థ టాటా మోటార్స్‌కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఒకపక్క దేశీయంగా

సరైన ధర వద్దే నిధుల సమీకరణ: యస్‌బ్యాంకు

Friday 4th October 2019

నిధుల సమీకరణ యస్‌ బ్యాంకు ముందున్న ప్రథమ ప్రాధాన్యంగా బ్యాంకు ఎండీ, సీఈవో రవనీత్‌ గిల్‌ తెలిపారు. ఏదో ఒక ధర వద్ద కాకుండా, బ్యాంకుకు ప్రయోజనదాయకమైన ధర వద్దే నిధులను సమీకరిస్తామని చెప్పారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.    నిధుల సమీకరణ ప్రణాళికల గురించి... నిధులను సమీకరించే సామర్థ్యం యస్‌ బ్యాంకుకు 100 శాతం ఉంది. అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్‌, కొన్ని దేశీయ కుటుంబ

Most from this category