News


ఐఆర్‌సీటీసీ.. అదరగొట్టింది!

Monday 14th October 2019
news_main1571030437.png-28866

బంపర్‌ లిస్టింగయిన షేరు
ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) షేరు మార్కెట్లో శుభారంభం చేసింది. ఇష్యూ ధర కన్నా భారీ ప్రీమియంతో షేరు సోమవారం లిస్టింగయింది. ఇష్యూ ధర రూ. 320 కాగా లిస్టింగ్‌ 101.25 శాతం ప్రీమియంతో రూ. 644వద్ద జరిగింది. ఇది మార్కెట్‌ వర్గాల అంచనాల కన్నా, గ్రేమార్కెట్‌ సంకేతాల కన్నా చాలా అధికం. లిస్టింగ్‌ అనంతరం దూసుకుపోయిన షేరు ఒక దశలో రూ. 698ని తాకింది. ఉదయం 10.41 నిమిషాలకు షేరు బీఎస్‌ఈలో రూ. 691 వద్ద ట్రేడవుతోంది. చాలామంది అనలిస్టులు లిస్టింగ్‌ రూ. 530 వద్ద ఉండొచ్చని అంచనాలు వేశారు.

ఎన్‌ఎస్‌ఈలో షేరు 95.6 శాతం ప్రీమియంతో రూ. 626 వద్ద లిస్టయింది. అనంతరం రూ. 698 వరకు దూసుకుపోయి ప్రస్తుతం రూ. 687 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో దాదాపు 26 లక్షల వాల్యూంలు నమోదయ్యాయి. షేరు అదరగొట్టే ప్రదర్శనతో పబ్లిక్‌ఆఫర్‌లో షేర్లు పొందిన వాళ్ల పెట్టుబడి ఒక్కరోజులోనే రెట్టింపయినట్లయింది. రిటైలర్లు, కంపెనీ ఉద్యోగులు లిస్టింగ్‌ లాభాలకు మరో పది రూపాయలు అదనపు ప్రయోజనం పొందారు. వీళ్లకు ఆఫర్‌ సందర్భంగా ఒక్కో షేరుపై పదిరూపాయల డిస్కౌంట్‌ లభించింది. కంపెనీ ఐపీఓ 112 రెట్లు ఓవర్‌సబ్‌స్కై‍్రబ్‌ అయినప్పుడే షేరుపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్లే ఐఆర్‌సీటీసీ అదరగొట్టిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

ఉదయం 10.48 గంటలకు షేరు ప్రదర్శన పైవిధంగా ఉంది.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 300 పాయింట్లు అప్‌!

Monday 14th October 2019

  దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక మంత్రి సమావేశం కానుండడంతో ప్రభుత్వ బ్యాంకులు సోమవారం ట్రేడింగ్‌లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. దీనితో పాటు అంతర్జాతీయ మార్కెట్లు లాభల్లో ట్రేడవుతుండడం, దేశీయ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో బలపడడం వంటి కారణాల వలన బ్యాంకింగ్‌ షేర్లు లాభాల బాట పట్టాయి. ఉదయం 10.41 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 327.35 పాయింట్లు లేదా 1.17 శాతం లాభపడి 28,369.85

ఇరాన్‌ ట్యాంకర్‌పై దాడి..పెరిగిన చమురు

Monday 14th October 2019

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త వాతావరణం పెరగడంతోపాటు, యుఎస్‌-చైనా మధ్య పాక్షిక ఒప్పందం కుదరడంతో శుక్రవారం సెషన్‌లో చమురు ధరలు 2 శాతం మేర పెరిగాయి. మధ్యప్రాచ్యంలో ఒత్తిళ్లు కొనసాగుతుండడంతో సోమవారం ట్రేడింగ్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ప్లాట్‌గా ప్రారంభమైంది. ఉదయం 9.53 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.40 శాతం నష్టపోయి బారెల్‌ 60.27 డాలర్ల వద్ద, డబ్యూటీ క్రూడ్‌ 0.48 శాతం నష్టపోయి 54.44 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.  కాగా గత వారంలో

Most from this category