News


మూడు రెట్లు ఎగసిన ఐఓసీ లాభం

Friday 31st January 2020
news_main1580440319.png-31348

  • 2,339  కోట్లకు నికర లాభం 
  • కలసివచ్చిన ఇన్వెంటరీ లాభాలు 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్‌ ఆయిల్ కార్పొ(ఐఓసీ) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో మూడు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.717 కోట్లుగా ఉన్న నికర లాభం (స్టాండ్‌అలోన్‌) ఈ క్యూ3లో రూ.2,339 కోట్లకు పెరిగిందని ఐఓసీ తెలిపింది. రిఫైనరీ మార్జిన్‌లు తక్కువగా ఉన్నా, కరెన్సీ పరమైన నష్టాలు ఉన్నా, ఇన్వెంటరీ లాభాల కారణంగా ఈ క్యూ3లో ఈ స్థాయి నికర లాభం సాధించామని ఐఓసీ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ వివరించారు. కార్యకలాపాల ఆదాయం రూ.1.60 లక్షల కోట్ల నుంచి రూ.1.44 లక్షల కోట్లకు తగ్గిందని తెలిపారు. మరిన్ని వివరాలు.....

  • రూ.1,608 కోట్ల ఇన్వెంటరీ లాభాలు...

ఈ కంపెనీ ముడి చమురు కొనుగోలు చేసినప్పుడు ఉన్న ధర కంటే, దానిని శుద్ధి చేసి ఇంధనంగా మార్చిన సమయానికి ముడి చమురు ధర అధికంగా ఉండటం వల్ల ఇన్వెంటరీ లాభాలు సాధించింది. గత క్యూ3లో రూ.8,523 కోట్లు ఇన్వెంటరీ నష్టాలు రాగా, ఈ క్యూ3లో రూ.1,608 కోట్ల ఇన్వెంటరీ లాభాలు వచ్చాయి. నికర రిఫైనరీ మార్జిన్‌ ఒక్కో బ్యారెల్‌కు 5.12 డాలర్ల నుంచి 2.15 డాలర్లకు తగ్గింది. గత క్యూ3లో కరెన్సీ మారకం పరంగా రూ.2,804 కోట్ల లాభాలు రాగా, ఈ క్యూ3లో రూ.182 కోట్ల కరెన్సీ మారకం నష్టాలు వచ్చాయి. 



You may be interested

నేడు, రేపు బ్యాంకుల బంద్‌

Friday 31st January 2020

వేతనాలను పెంచాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా నేడు, రేపు (శుక్ర, శనివారం) బ్యాంక్‌ ఉద్యోగులు, అధికారులు సమ్మె చేయనున్నారు. ఈ రెండు రోజులు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు సాగవని యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఒక ప్రకటనలో తెలిపింది. 20 శాతం వేతనాల పెంపు, ఐదు రోజుల పనిదినాలు, ఎన్‌పీఎస్‌ తొలగింపు వంటి 11 డిమాండ్లతో కార్మిక శాఖ, కేంద్రంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని..

టాటా మోటార్స్‌ లాభం రూ.1,756 కోట్లు

Friday 31st January 2020

రూ.71,677 కోట్లకు తగ్గిన ఆదాయం  కొనసాగుతున్న జేఎల్‌ఆర్‌ టర్న్‌అరౌండ్‌  న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో రూ.1,756 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.26,961 కోట్ల నికర నష్టాలు వచ్చాయని టాటా మోటార్స్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ.76,916 కోట్ల నుంచి రూ.71,677 కోట్లకు తగ్గిందని పేర్కొంది. లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ టర్న్‌

Most from this category