STOCKS

News


ఐఓసీ లాభం 83 శాతం డౌన్‌

Friday 1st November 2019
news_main1572580141.png-29274

  • తగ్గిన జీఆర్‌ఎమ్‌
  • రూ.1,807 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొ(ఐఓసీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 83 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.3,247 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.564 కోట్లకు తగ్గిందని ఐఓసీ తెలిపింది. రిఫైనరీ మార్జిన్లు తగ్గడం, ఇన్వెంటరీ నష్టాల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని కంపెనీ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ వివరించారు. 

రూ.1.32 లక్షల కోట్లకు తగ్గిన టర్నోవర్‌
గత క్యూ2లో 6.79 డాలర్లుగా ఉన్న స్థూల రిఫైనరీ మార్జిన్‌(జీఆర్‌ఎమ్‌-ఒక్కో బ్యారెల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చినందువల్ల లభించే లాభం) ఈ క్యూ2లో 1.28 డాలర్లకు తగ్గిందని సంజీవ్‌ సింగ్‌ తెలిపారు. ఇన్వెంటరీ నష్టాలను పరిగణనలోకి తీసుకోకుంటే జీఆర్‌ఎమ్‌ 3.99 డాలర్లుగా ఉండేదని పేర్కొన్నారు. గత క్యూ2లో రూ.2,895 కోట్ల ఇన్వెంటరీ లాభాలు రాగా ఈ క్యూ2లో రూ.1,807 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయని వివరించారు. అంతే కాకుండా ఈ క్యూ2లో రూ.1,135 కోట్ల ఫారెక్స్‌ నష్టాలు కూడా వచ్చాయని తెలిపారు. టర్నోవర్‌ రూ.1.51 లక్షల కోట్ల నుంచి రూ.1.32 లక్షల కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. ఈ క్యూ2లో 21.4 మిలియన్‌ టన్నుల పెట్రోలియమ్‌ ఉత్పత్తులను విక్రయించామని, 17.5 మిలియన్‌ టన్నుల చమురును శుద్ధి చేశామని వివరించారు. 

ఈ కంపెనీ ముడి చమురును కొనుగోలు చేసినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర కంటే, ఆ చమురును శుద్ధి చేసి ఇంధనంగా మార్చినప్పుడు ధర అధికంగా ఉంటే, అప్పుడు ఇన్వెంటరీ నష్టాలు వస్తాయి. You may be interested

సెప్టెంబరులో ఫార్మా ఎగుమతులు జూమ్‌

Friday 1st November 2019

సెప్టెంబరులో ఫార్మా ఎగుమతులు జూమ్‌ క్రితం ఏడాదితో పోలిస్తే 8.72 శాతం వృద్ధి రూ.12,600 కోట్లకు చేరిన ఎగుమతులు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- భారత ఫార్మా రంగం మంచి ఊపు మీద ఉంది. ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబరులో దేశం నుంచి ఎగుమతులు తిరిగి పుంజుకున్నాయి. 2018తో పోలిస్తే 2019 ఆగస్టులో ఎక్స్‌పోర్ట్స్‌ 0.19 శాతం తిరోగమన వృద్ధి నమోదు చేశాయి. సెప్టెంబరు నెలలో ఎగుమతులు గాడినపడ్డాయి. ఈ కాలంలో ఎక్స్‌పోర్ట్స్‌ 8.72

ఎన్‌బీఎఫ్‌సీల్లోనూ ఎన్‌పీఏల ప్రక్షాళన చేపట్టాలి

Friday 1st November 2019

బలమైన వృద్ధికి ఇది అవసరం ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రక్షాళన వేగంగా ముగించాలి ఆర్‌బీఐ పూర్వపు గవర్నర్‌ రాజన్‌ సూచన బీజేపీ హయాంలోనే తన పదవీ కాలం ఎక్కువని ప్రకటన న్యూఢిల్లీ: రానున్న కాలంలో పటిష్టమైన వృద్ధి కోసం ప్రభుత్వరంగ బ్యాంకుల మాదిరే ఎన్‌బీఎఫ్‌సీ రంగంలోనూ ఎన్‌పీఏల ప్రక్షాళన అవసరమని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. లేదంటే ఆర్థిక రంగానికి భారంగా మారుతుందన్నారు. తన పదవీ కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిల (ఎన్‌పీఏలు)

Most from this category