STOCKS

News


ఐఓసీ లాభం 47 శాతం డౌన్‌

Thursday 1st August 2019
news_main1564636510.png-27464

  • తగ్గిన జీఆర్‌ఎమ్‌
  • ఇన్వెంటరీ లాభాలు కూడా తగ్గుముఖం 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 47 శాతం క్షీణించింది. గత క్యూ1లో రూ.7,092 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.3,738 కోట్లకు తగ్గిందని ఐఓసీ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ తెలిపారు. ఒక్కో షేర్‌ పరంగా చూస్తే, నికర లాభం రూ.7.48 నుంచి రూ.4.07కు తగ్గిందని పేర్కొన్నారు. రిఫైనరీ మార్జిన్లు, ఇన్వెంటరీ లాభాలు తగ్గడం వల్ల నికర లాభం కూడా తగ్గిందని వివరించారు. గత క్యూ1లో రూ.7,065 కోట్లుగా ఉన్న ఇన్వెంటరీ లాభాలు ఈ క్యూ1లో రూ.2,362 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఆదాయంలో పెద్దగా మార్పు లేదని,  రూ.1.53 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. 
సగానికి పైగా తగ్గిన జీఆర్‌ఎమ్‌...
ఒక్కో బ్యారెల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చినందువల్ల వచ్చే స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌(జీఆర్‌ఎమ్‌) 4.69 డాలర్లకు తగ్గిందని, గత క్యూ1లో ఈ జీఆర్‌ఎమ్‌ 10.21 డాలర్లని సంజీవ్‌ సింగ్‌ పేర్కొన్నారు. కాగా గత క్యూ1లో రూ.1,805 కోట్ల విదేశీ మారక ద్రవ్య నష్టాలు రాగా ఈ క్యూ1లో రూ.92 కోట్ల విదేశీ మారక ద్రవ్య లాభాలు వచ్చాయని చెప్పారు. ఈ క్యూ1లో మొత్తం 22.66 మిలియన్‌ టన్నుల చమురు ఉత్పత్తులను (ఎగుమతులు కూడా కలుపుకొని) విక్రయించామని తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా విక్రయించిన కిరోసిన్‌కు రూ.656 కోట్లు, వంట గ్యాస్‌(ఎల్పీజీ)కి రూ.3,997 కోట్ల సబ్సీడీని ప్రభుత్వం నుంచి పొందామని పేర్కొన్నారు. You may be interested

అలహాబాద్‌ బ్యాంక్‌ లాభం రూ.128 కోట్లు

Thursday 1st August 2019

తగ్గిన మొండి కేటాయింపుల భారం  మొత్తం ఆదాయం రూ.4,747 కోట్లకు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో రూ.128 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో రూ.1,944 కోట్ల నికర నష్టాలు వచ్చాయని అలహాబాద్‌ బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడంతో ఈ క్యూ1లో లాభాల బాట పట్టామని అలహాబాద్‌ బ్యాంక్‌ తెలిపింది. అంతకు ముందటి క్వార్టర్‌(గత క్యూ4లో) రూ.3,834 కోట్ల నికర

పడిపోయిన చమురు

Thursday 1st August 2019

యుఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల కోత మరింతగా ఉండదనే స్పష్టమైన సంకేతాలను ఇవ్వడంతో పాటు, యుఎస్‌-చైనా మధ్య జరిగిన వాణిజ్య చర్చలలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో గురువారం చమురు ధరలు ఒక డాలర్‌ మేర పడిపోయాయి.యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే ఎక్కువగా పడిపోవడంతో పాటు, ఒపెక్‌ దేశాలలో​చమురు ఉత్పత్తి తగ్గడం, లిబియా ఎగుమతులను తగ్గించడం తదితర సానుకూల అంశాలున్నప్పటికీ, క్రూడ్‌ ధరలు తగ్గాయి. బ్రెంచ్‌ మార్క్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 1.6

Most from this category