News


సిటీ గ్యాస్‌ బిడ్డింగ్‌లో ఐవోసీ టాప్‌

Monday 11th February 2019
news_main1549867506.png-24127

న్యూఢిల్లీ: నగరాల్లో గృహాలకు పైపుల ద్వారా వంట గ్యాస్‌, వాహనాలకు సీఎన్‌జీ సరఫరా కోసం నిర్వహించిన పదో విడత లైసెన్సుల వేలంలో ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) అత్యధిక స్థాయిలో బిడ్లు దాఖలు చేసింది. అదానీ గ్రూప్‌, హిందుస్తాన్ పెట్రోలియం, ఇంద్రప్రస్థ గ్యాస్ మొదలైనవి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పెట్రోలియం, గ్యాస్ రంగ నియంత్రణ సంస్థ (పీఎన్‌జీఆర్‌బీ) వెల్లడించిన వివరాల ప్రకారం ఐవోసీ మొత్తం 35 నగరాల్లో సొంతంగా, అదానీ గ్యాస్‌ భాగస్వామ్యంతో మరో ఏడు నగరాల్లో లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకుంది. అదానీ గ్యాస్ సొంతంగా 19 నగరాలకు, ఐవోసీ భాగస్వామ్యంతో ఏడు నగరాలకు బిడ్లు వేసింది. ప్రభుత్వ రంగ గెయిల్ గ్యాస్ ప్రాంతాలకు బిడ్స్ దాఖలు చేసింది. పదో విడతలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు సహా మొత్తం 50 నగరాలకు బిడ్డింగ్ నిర్వహించారు. ఫిబ్రవరి 7-9 మధ్యలో బిడ్లు తెరిచారు. 14 రాష్ట్రాల్లో 124 జిల్లాలకు ఈ లైసెన్సుల ద్వారా సేవలు అందించవచ్చు.



You may be interested

మరో రూ.27,380 కోట్లు ఇవ్వండి

Monday 11th February 2019

ఆర్‌బీఐని కోరిన కేంద్రం న్యూఢిల్లీ: రిస్కులు, రిజర్వుల పేరిట గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో తన వద్ద అట్టే పెట్టుకున్న రూ. 27,380 కోట్ల నిధులను ప్రభుత్వ ఖజానాకు బదలాయించాలని రిజర్వ్ బ్యాంక్‌ను (ఆర్‌బీఐ) కేంద్ర ఆర్థిక శాఖ కోరినట్లు తెలుస్తోంది. 2016-17లో ఆర్‌బీఐ రూ. 13,190 కోట్లు, 2017-18లో రూ. 14,190 కోట్లు రిస్కులు, రిజర్వుల కింద ఆర్‌బీఐ పక్కన పెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజాగా ఈ నిధులను

ఎస్‌బీఐ, ఓబీసీ మొండిబకాయిల విక్రయం

Monday 11th February 2019

- రూ. 5,740 కోట్లు రాబట్టుకునేందుకు కసరత్తు న్యూఢిల్లీ: సుమారు రూ. 5,740 కోట్ల బాకీలను రాబట్టుకునే క్రమంలో వాటికి సంబంధించిన మొండిపద్దులను విక్రయించడంపై ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) దృష్టి సారించాయి. సుమారు రూ. 4,975 కోట్ల రికవరీకోసం అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలు (ఏఆర్‌సీ), ఆర్థిక సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానిస్తూ ఎస్‌బీఐ ప్రకటన విడుదల చేసింది. వీటిలో

Most from this category