News


థాపర్‌ను తొలగించాలి

Monday 26th August 2019
news_main1566792788.png-28008

  • సీజీ పవర్‌ రుణదాతలు, ఇన్వెస్టర్ల అభిప్రాయం

న్యూఢిల్లీ: భారీ కుంభకోణం బైటపడిన నేపథ్యంలో సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్‌ చైర్మన్‌ హోదా నుంచి గౌతమ్ థాపర్‌ను తప్పించాలని సంస్థకు రుణాలిచ్చిన సంస్థలు, ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. సంస్థ ఆస్తులను తనఖా పెట్టి రుణాలు పొందిన కొందరు సిబ్బంది, ఆ నిధులను దారి మళ్లించిన తీరు ఇటీవల విచారణలో బైటపడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో గవర్నెన్స్‌పరమైన లోపాలను బోర్డు గుర్తించినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు సీజీ పవర్ వెల్లడించింది. 
మోసానికి పాల్పడిన వారిలో కొందరు ప్రస్తుత, పాత ఉద్యోగులు ఉన్నారని గుర్తించినట్లు తెలిపింది. వీరిలో కొందరు నాన్‌-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కూడా ఉన్నారు. నిధులను దారి మళ్లించడంతో పాటు కొన్ని రుణాల (తీసుకున్నవి, ఇచ్చినవి) పరిమాణం కూడా ఖాతాల్లో తగ్గించి చూపడం జరిగినట్లు సీజీ పవర్ పేర్కొంది. సంబంధిత పార్టీల రుణాలు రూ. 1,990 కోట్ల మేర, ఇతర పార్టీల రుణాలు రూ. 2,806 కోట్ల మేర తగ్గించి చూపించి ఉండవచ్చని (2018 మార్చి 31 నాటికి) విచారణలో అంచనాలు ఉన్నాయని వివరించింది.    
థాపర్‌ వాటా 8 వేల షేర్లే..
    అనుమానాస్పద లావాదేవీలపై విచారణ సందర్భంగా మే 10న సీఈవో కేఎన్ నీలకంఠ్‌ను సెలవుపై పంపినప్పటికీ, చైర్మన్‌గా థాపర్‌ కొనసాగుతూనే ఉన్నారు. విచారణ కోసం పట్టుబట్టిన ఇన్వెస్టర్లే.. తాజాగా కంపెనీ వ్యవహారాల ప్రక్షాళన కోసం థాపర్‌, నీలకంఠ్‌ను వారి హోదాల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీకి పటిష్టమైన ఆర్డర్‌ బుక్ ఉన్నప్పటికీ, భారీ రుణభారం పేరుకుపోయి ఉంటుందని ఇన్వెస్టర్లు, రుణదాతలు భావిస్తున్నట్లు వివరించాయి. చైర్మన్‌ను తొలగించేందుకు, మరికొన్ని వారాల్లో స్వతంత్ర డైరెక్టర్లలో ఒకరిని ఆ హోదాలో నియమించేందుకు కంపెనీ బోర్డుకు అధికారాలు ఉన్నాయని పేర్కొన్నాయి. సీజీ పవర్‌ మొత్తం 62.6 కోట్ల షేర్లలో థాపర్‌కి ప్రస్తుతం 8,574 షేర్లు మాత్రమే ఉన్నాయి. ఈ షేర్‌హోల్డింగ్‌తో ఆయనకు బోర్డు హోదా కూడా ఉండదు. కానీ షేర్‌హోల్డర్లకు మాత్రమే బోర్డు సభ్యులను తొలగించే అధికారం ఉన్నందున.. ఆయన బోర్డులో కొనసాగే అవకాశం ఉంది. సీజీ పవర్‌ వ్యవస్థాపక ప్రమోటర్ అయినప్పటికీ గతంలో రుణాల సమీకరణ కోసం ఆయన తనఖా ఉంచిన షేర్లను.. బాకీల వసూలు కోసం బ్యాంకులు విక్రయిస్తూ పోవడంతో థాపర్‌ వాటా తగ్గిపోయింది. థాపర్‌ తనఖా పెట్టిన షేర్లను యస్‌ బ్యాంక్‌.. బాకీల వసూలు కింద జమ వేసుకోవడంతో సీజీ పవర్‌లో ప్రస్తుతం దానికి 12.79 శాతం వాటాలు దఖలు పడ్డాయి. You may be interested

తీవ్రమైన ట్రేడ్‌ వార్‌..పతనంలో ఆసియా మార్కెట్లు

Monday 26th August 2019

యుఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌ తీవ్రమవ్వడంతో ఆసియా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ (హెచ్‌ఎస్‌ఐ) దాదాపు 3 శాతం, చైనా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ (ఎస్‌హెచ్‌కాంప్) 1.2శాతం నష్టపోయాయి. జపాన్‌కు చెందిన నికాయ్‌ 225 (ఎన్‌225) 2.2 శాతం, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి (కోస్పి) 1.7 శాతం క్షీణించాయి. యునైటెడ్ స్టేట్స్(యుఎస్‌), చైనా  రెండు దేశాలు సుంకాలను పెంచడంతో యుఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌

గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తుల్లో జంప్‌

Monday 26th August 2019

- రూ.5,000 కోట్లను దాటిన ఏయూఎం న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) నిర్వహణలోని ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్ల మార్కును దాటాయి. జూలైలో ఏయూఎం రూ.5,079.22 కోట్లుగా నమోదైనట్లు మార్నింగ్‌స్టార్ తాజా డేటాలో వెల్లడైంది. ఈ ఏడాదిలో.. ఆగస్టులో రూ. 4,594 కోట్లు, మేలో రూ. 4,607 కోట్లు, జూన్‌లో రూ. 4,931 కోట్లు ఏయూఎం నమోదైంది. స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనం

Most from this category