News


కార్వీపై ఇన్వెస్టర్ల ఫిర్యాదులు

Monday 18th November 2019
news_main1574048990.png-29658

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్‌ సర్వీసుల్లో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ కార్వీపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తమకు రావాల్సిన మొత్తాలను కార్వీ చెల్లించడం లేదంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రధాని కార్యాలయంతోపాటు ఆర్థిక శాఖ, సెబీకి దేశవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. దీనినిబట్టి చూస్తుంటే నగదు కొరతతో కార్వీ ఇబ్బంది పడుతోందని సమాచారం. కాస్టర్‌ సీడ్‌ (ఆముదం) కాంట్రాక్టుల్లో కార్వీ క్లయింట్లు పెద్ద ఎత్తున నష్టపోవడంతో.. వారి నుంచి రావాల్సిన బాకీలు పేరుకుపోవడం కార్వీ ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలుస్తోంది. ఇన్వెస్టర్లు ఒకరిని చూసి ఒకరు కార్వీపై ఫిర్యాదులు చేస్తున్నారు. తన ట్రేడింగ్‌ అకౌంట్‌లో ఉన్న నగదు నిల్వను బ్యాంకు ఖాతాకు మళ్లించాల్సిందిగా కోరితే, సర్వర్‌ సమస్య అంటూ దాటవేస్తున్నారని దీపక్‌ ముంద్రా అనే ఇన్వెస్టర్‌ ట్వీట్‌ చేశారు. ఎన్నిసార్లు కోరినా సర్వర్‌ సమస్య అంటున్నారని, కార్వీలో ఏదో తప్పు జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు కోరినా చెల్లింపులు జరపడం లేదని, కార్వీ చర్యలతో నమ్మకం కోల్పోయామని పుణే ఇన్వెస్టర్‌ బందియా షా ఆవేదన వ్యక్తం చేశారు. కార్వీ తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, సాయం చేయాలంటూ సెబీని కోరారు. 20 రోజులుగా వెంటపడుతున్నా స్పందించడం లేదంటూ ఎంకేఆర్‌ అనే ఇన్వెస్టర్‌ ఆర్థిక శాఖకు విన్నవించారు. వందకుపైగా కాల్స్‌ చేసినా ఫలితం లేదని గీతేష్‌ యోలే అనే ఇన్వెస్టర్‌ ప్రధాని కార్యాలయంతోపాటు ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశారు. ‘భారత్‌లో అసలేం జరుగుతోంది. బీఎంఏ దారిలో కార్వీ’ అని ట్వీట్‌ చేశారు. 



You may be interested

ప్రైవేటు కంపెనీల మాదిరే పీఎస్‌యూల నిర్వహణ: సీఐఐ

Monday 18th November 2019

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలు (పీఎస్‌యూ) సైతం ప్రైవేటు కంపెనీల మాదిరే పాలనా ప్రమాణాలను అనుసరించే విధంగా ఉండాలని సీఐఐ ప్రభుత్వానికి సూచించింది. సీవీసీ, కాగ్‌, సీబీఐ దర్యాప్తు వంటివి తరచుగా ప్రభుత్వరంగ సంస్థల నిర్ణయాల్లో అతి జాగ్రత్త లేదా నిర్ణయాలు నిలిచిపోవడానికి కారణమవుతున్నాయని, ఇలా కాకుండా చూసి, ప్రైవేటు సంస్థల మాదిరే పనిచేసే వాతావరణం కల్పించాలని పేర్కొంది. భారత ప్రభుత్వరంగ సంస్థలు అంతర్జాతీయంగా పోటీ పడగలవని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌

సౌదీ ఆరామ్‌కో ఐపీఓ సైజు 2,560 కోట్ల డాలర్లు !

Monday 18th November 2019

ప్రైస్‌బ్యాండ్‌ 8-8.5 డాలర్లు డిసెంబర్‌ రెండో వారంలో లిస్టింగ్‌ !  రియాద్‌: సౌదీ అరేబియా చమురు దిగ్గజం, సౌదీ ఆరామ్‌కో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ప్రైస్‌బ్యాండ్‌ను నిర్ణయించింది. ఈ ఐపీఓలో భాగంగా 1.5 శాతం వాటా (సుమారుగా 300 కోట్ల షేర్లు)ను విక్రయించనున్నది. ప్రైస్‌బ్యాండ్‌ను 30-32 సౌదీ రియాల్స్‌ (8-8,5 డాలర్లు-సుమారుగా రూ.576-612 రేంజ్‌లో)గా నిర్ణయించింది. ఈ ప్రైస్‌బ్యాండ్‌ పరంగా చూస్తే, సౌదీ ఆరామ్‌కో కంపెనీ విలువ 1.60-1.71  లక్షల కోట్ల డాలర్లుగా

Most from this category