News


రియల్టీలోకి పెట్టుబడుల ప్రవాహం..

Monday 29th July 2019
Markets_main1564384213.png-27377

- ప్రథమార్ధంలో దాదాపు రూ. 18,900 కోట్ల నిధులు
ముంబై: నియంత్రణ విధానాలపరమైన ప్రతికూల పరిస్థితులతో రియల్టీ రంగం కార్యకలాపాలు మందకొడిగా ఉన్నప్పటికీ.. పెట్టుబడులు మాత్రం భారీగానే వస్తున్నాయి. 2019 ప్రథమార్ధంలో 2.7 బిలియన్ డాలర్ల మేర (దాదాపు రూ. 18,900 కోట్లు) వచ్చాయని ప్రాపర్టీల నిర్వహణ సంస్థ వెస్టియాన్‌, పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 2015-2018 మధ్యకాలంలో రియల్టీలోకి పెట్టుబడుల ప్రవాహం 25.7 బిలియన్ డాలర్ల స్థాయిని తాకింది. అదే సానుకూల ధోరణులు 2019 ప్రథమార్ధంలోనూ కొనసాగాయని నివేదిక వివరించింది. మౌలిక సదుపాయాల కల్పన, రహదారులను మెరుగుపర్చడం తదితర చర్యలు చేపడితే ఈ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. గడిచిన దశాబ్దకాలంగా రియల్ ఎస్టేట్‌లోకి సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు .. ముఖ్యంగా ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ గణనీయంగా పెరిగాయని నివేదిక పేర్కొంది. సంస్థాగత పెట్టుబడుల్లో దాదాపు 80 శాతం వాటా పీఈ ఇన్వెస్టర్లదే ఉందని..ఇలాంటి అంశాలే రియల్టీ రికవరీపై ఆశల్ని సజీవంగా ఉంచుతున్నాయని వివరించింది. 



You may be interested

ఐపీవో బాటలో గ్రామీణ బ్యాంకులు

Monday 29th July 2019

- ఈ ఏడాదే 3-4 బ్యాంకులు పబ్లిక్ ఇష్యూకి వచ్చే అవకాశం న్యూఢిల్లీ: ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) కొన్నింటిని స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ చేయాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తయ్యాక ఈ ఆర్థిక సంవత్సరంలోనే 3-4 ఆర్‌ఆర్‌బీల పబ్లిక్ ఇష్యూ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పుడు 45 దాకా ఉన్న ఆర్‌ఆర్‌బీల సంఖ్యను విలీన ప్రక్రియ

ఈ వారం రికమెండేషన్లు

Monday 29th July 2019

ఎల్‌ అండ్‌ టీ     కొనొచ్చు ​బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ.1,392 టార్గెట్‌ ధర:రూ.1,790 ఎందుకంటే:- ఇంజినీరింగ్‌ దిగ్గజం, ఎల్‌ అండ్‌ టీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఎన్నికల కారణంగా దేశీయ ఇంజినీరింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ విభాగం ఆదాయం అంతంతమాత్రంగానే ఉండగలదన్న అంచనాలున్నాయి. అయితే ప్రాజెక్ట్‌ల అమలు జోరు కారణంగా ఈ విభాగం ఆదాయం 18 శాతం పెరిగింది. కంపెనీ కన్సాలిడేడెట్‌ ఆదాయం 10

Most from this category