News


రియల్టీపై ఓ కన్నేయండి!

Tuesday 5th February 2019
news_main1549306769.png-24011

మధ్యంతర బడ్జెట్‌లో రియాలిటీ రంగానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు వీటిపై ఓ సారి దృష్టి సారించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, సంక్షోభంలో ఉన్న  రియల్టీ రంగాన్ని గాడిన పెట్టే ప్రయత్నంగా పేర్కొంటున్నారు. రెండు ఇళ్లను కొనుగోలు చేసినా మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం, రెండో ఇంటి అద్దె ఆదాయానికి పన్ను మినహాయింపు, అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు, ఫ్లాట్లపై పన్ను రాయితీలు సహా ఎన్నో ప్రయోజనాలను ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో పేర్కొన్న విషయం గమనార్హం. ఈ నిర్ణయాలు రియల్‌ ఎస్టేట్‌ రంగంపై సానుకూల ప్రభావం చూపిస్తాయని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. 

 

వీటికి మేలు
ముఖ్యంగా నిర్మాణం పూర్తయి విక్రయం కాకుండా ఉన్న ప్రాజెక్టులను అద్దెకు ఇవ్వగా వచ్చే ఆదాయానికి ఏడాది పాటు పన్ను మినహాయింపు ఉండగా, దీన్ని రెండేళ్లకు ప్రభుత్వం పెంచడం గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఒబెరాయ్‌ రియాలిటీకి మేలు చేస్తుందని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొన్నవి రియల్టీ రంగానికి సానుకూలమని హేమ్‌ సెక్యూరిటీస్‌ సైతం తెలిపింది. సెక్షన్‌ 80 ఐబీఏ కింద వచ్చే ఏడాది మార్చి వరకు అనుమతి పొందే ప్రాజెక్టులకు పన్ను మినహాయింపు పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి గోయల్‌ ప్రకటించారు. ఈ సెక్షన్‌ కింద అందుబాటు ధరల ఇళ్ల ప్రాజెక్టుల అభివృద్ధిపై వచ్చే నూరు శాతం లాభాలపై పన్ను మినహాయింపు లభిస్తుంది. దీంతో అందుబాటు ధరల ప్రాజెక్టులను చేపట్టే కంపెనీలకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ఎడెల్‌వీజ్‌ ప్రొఫెషనల్‌ ఇన్వెస్టర్‌ రీసెర్చ్‌ సంస్థ పేర్కొంది. ఈ విభాగంలో శోభ, పురవంకర, టాటా హౌసింగ్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ కంపెనీలకు లబ్ధి కలుగుతుందని తెలిపింది. అమ్ముడుకాని ఇళ్లపై నోషనల్‌ అద్దె పన్ను మరో ఏడాది పాటు మినహాయింపు ఇవ్వడం డెవలపర్లకు మేలు చేస్తుందని, ముఖ్యంగా ఎక్కువగా అమ్ముడుపోని యూనిట్లు ఉన్న కంపెనీలకు ప్రయోజనం కలుగుతుందని ఎడెల్‌వీజ్‌ తెలిపింది. ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఒబెరాయ్‌ రియాలిటీ కంపెనీల వద్ద అమ్ముడుపోని యూనిట్లు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. You may be interested

బేర్‌ మార్కెట్లోనూ ప్రశాంతంగా ఉండాలనుకుంటే..

Tuesday 5th February 2019

ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది సున్నిత మనస్కులే. చిన్న పాటి ఒడుదుడుకులకే షేక్‌ అయిపోతుంటారు. ఆందోళనతో తప్పుడు నిర్ణయాల వైపు అడుగులు వేస్తుంటారు. నిజానికి మంచి స్టాక్స్‌ లేదా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉన్న వారు సైతం వరుసగా మార్కెట్లలో కరెక్షన్‌ చూసి కంగారు పడిపోతుంటారు. దీంతో వారికి బేర్‌ మార్కెట్లలో మానసిక ప్రశాంతత, కంటి నిండా నిద్ర కూడా కరువవుతుంది. మార్కెట్‌ ఆటుపోట్లకు కలత చెందకుండా ఉండాలంటే అందుకు కొన్ని

మూడోరోజూ లాభాల ముగింపే

Monday 4th February 2019

10900పైన నిఫ్టీ సెన్సెక్స్‌ లాభాల సెంచరీ ఆదుకున్న రిలయన్స్‌ఇండస్ట్రీస్‌  మార్కెట్‌ వరుసగా మూడోరోజూ లాభాలతోనే ముగిసింది. రోజులో అధికభాగం నష్టాల్లోనే ట్రేడైన మార్కెట్‌...ముగింపు సమయంలో జరిగిన కొనుగోళ్లతో  లాభంతో ముగిసింది. సూచీలకు ఇది వరుసగా మూడోరోజూ లాభాల ముగింపే. నిఫ్టీ 10900 మార్కును అందుకుంది. సెన్సెక్స్‌ సెంచరీ లాభాల్ని ఆర్జించింది. క్రితం ట్రేడింగ్‌ సెషన్‌ సమయంలో వెల్లడైన బడ్జెట్‌ ప్రతిపాదనల్ని ఇన్వెస్టర్లు ఆకళింపు చేసుకుంటున్న నేపథ్యంలో  నేడు సూచీలు స్వల్పనష్టంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రారంభం నుంచి

Most from this category